ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నవంబర్ వరకు నికర GST వసూళ్లలో 5.80% పెరుగుదలను నమోదు చేసింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, పన్ను చెల్లింపుదారుల అనుసరణ మెరుగవడం, అమలు చర్యలు కఠినంగా ఉండటం ఈ అభివృద్ధికి కారణమయ్యాయి. అయితే 2025 నవంబర్ నెలలో వసూళ్లు కొంత తగ్గాయి. దీనికి ముఖ్య కారణం 22-09-2025 నుంచి అమల్లోకి వచ్చిన GST 2.0 రేటు తగ్గింపులు. ఆటోమొబైల్, సిమెంట్, FMCG, ఎలక్ట్రానిక్స్, పాల ఉత్పత్తులు వంటి రంగాల్లో పన్ను రేట్లు తగ్గడం వల్ల ఆదాయం తగ్గినా.. లావాదేవీల పరిమాణం (Volume) పెరగడం మొత్తం సంవత్సర వసూళ్లను సానుకూలంగా ప్రభావితం చేసింది.
రంగాల వారీగా ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు..
1. SGST ఆదాయం తగ్గుదల
SGST ఆదాయం 7.35% తగ్గింది.
రేటు తగ్గింపుల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
అమ్మకాలు పెరిగినా తక్కువ పన్ను రేట్ల కారణంగా మొత్త వసూళ్లు తగ్గాయి.
2. IGST సెటిల్‌మెంట్లలో తగ్గుదల
IGST సెటిల్‌మెంట్ 2.57% తగ్గింది.
SGST ITC సర్దుబాట్లు పెరగడం, IGST రివర్సల్స్ తొలగించడం ప్రభావం చూపాయి.
3. పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం పడిపోవడం
మొంథా తుఫాన్ ప్రభావంతో రవాణా మందగించి, కేవలం 1.06% ఆదాయం తగ్గింది.
అయినా మొత్తంగా రాష్ట్రం GST వార్షిక వృద్ధి లక్ష్యంలో 74% చేరటం ఒక స్థిర ఆర్థిక నిర్వహణకు సూచిక.