Future City: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండనుంది.? ఏఐ ఇచ్చిన ఫొటోలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

Published : Oct 02, 2025, 10:03 AM IST

Future City: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచ‌ర్ సిటీ. అయితే ఈ న‌గ‌రం సాకార‌మైన త‌ర్వాత ఎలా ఉంటుంద‌ని జెమినీ ఏఐని అడ‌గ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోల‌ను ఇచ్చింది.

PREV
15
అసలీ ఫ్యూచర్ సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారు.?

ప్ర‌స్తుతం సికింద్రాబాద్, హైద‌రాబాద్‌తో పాటు సైబ‌రాబాద్ న‌గ‌రాలు ఉండ‌గా.. కొత్త‌గా ఫ్యూచ‌ర్ సిటీని నిర్మించాల‌ని రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకు గాను శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారులను ఎంచుకున్నారు. వీటి వెంబ‌డి ఈ న‌గ‌రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేప‌డుతున్నారు. ఇందులో మొత్తం 56 రెవెన్యూ గ్రామాలను సిద్ధం చేశారు, ఈ మొత్తం నిర్వహణను ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్నారు.

25
నాలుగు విభాగాలు

ఫ్యూచ‌ర్ సిటీని మొత్తం నాలుగు విభాగాలుగా నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం, గ్రీన్ జోన్లుగా ఉండ‌నున్నాయి. ఇదే ప్ర‌శ్న‌ను గూగుల్ జెమినీ ఏఐని అడిగి ఒక ఫొటోను క్రియేట్ చేయ‌మ‌ని అడ‌గ్గా. ఇదిగో ఈ ఫొటోలో క‌నిపిస్తున్న విధంగా డిజైన్ చేసి చూపించింది.

35
కాలుష్య ర‌హిత న‌గ‌రంగా

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోన్న అంశాల్లో పొల్యుష‌న్ ఒక‌టి. పెరుగుతోన్న న‌గ‌రీక‌ర‌ణ నేప‌థ్యంలో కాలుష్యం కూడా పెరుగుతోంది. అందుకే ఫ్యూచ‌ర్ సిటీలో కాలుష్య నియంత్ర‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో ఎమిషన్స్, పునరుత్పత్తి శక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణలో వినూత్న విధానాలను అవలించనున్నారు. ఇదే విష‌యాన్ని గూగుల్ జెమినీ ఏఐని ప్ర‌శ్నించ‌గా ఇదిగో ఈ ఫొటోను ఇచ్చింది.

45
ప్ర‌త్యేక ఇన్నోవేష‌న్ హ‌బ్‌లు

పేరుకు అనుగుణంగానే ఫ్యూచ‌ర్ సిటీని టెక్నాల‌జీకి అడ్డాగా నిర్మిచ‌నున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్‌, స్మార్ట్ టెక్నాలజీ వంటి రంగాల కోసం ఈ స్మార్ట్ సిటీలో ప్రత్యేక ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇన్నోవేష‌న్ హ‌బ్‌లు ఎలా ఉంటాయ‌న్న ప్ర‌శ్న‌కు జెమినీ ఏఐ ఇలాంటి ఫొటో ఇచ్చింది.

55
అద్భుత‌మైన మౌలిక వ‌స‌తులు

భ‌విష్య‌త్ జ‌నాభాకు అనుగుణంగా ఫ్యూచ‌ర్ సిటీలో మౌలిక వ‌స‌తుల‌కు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా 40 ఫీట్, 33 ఫీట్ వెడల్పు రహదారులు, భూగర్భ విద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు తాగునీటి కోసం ప్రత్యేక పైప్ లైన్‌లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మించ‌నున్నారు. LED లైట్స్, వర్షపు నీటి సంరక్షణ కోసం స్పాంజ్ పాండ్స్ నిర్మాణం, సౌర శక్తితో పనిచేసే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌రి ఈ వ‌స‌తులు ఎలా ఉండ‌నున్నాయ‌న్న ప్ర‌శ్న‌కు జెమినీ ఏఐ ఇచ్చిన స‌మాధానం ఇదే.

Read more Photos on
click me!

Recommended Stories