First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?

Published : Jul 04, 2026, 08:21 AM IST

First Railway Station in Telangana: తెలంగాణలో తొలి రైల్వే స్టేషన్ ఏది? దానిని ఎవరు, ఎందుకు కట్టించారు? అనే విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఫస్ట్ స్టేషన్ వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ హిస్టరీ, నిజాం రాజుల కాలం నాటి ఆసక్తికర విషయాలు మీకోసం.

PREV
16
తెలంగాణలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది? ఆనాటి నిజాం రాజుల సీక్రెట్ స్టోరీ ఇదే

ఈ రోజుల్లో రైలు ప్రయాణం అంటే మనందరికీ చాలా కామన్. కానీ, అసలు మన తెలంగాణలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఎక్కడ కట్టారో తెలుసా? దానిని ఎవరు కట్టించారు? అసలు ఏ అవసరం కోసం అంత పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు? ఈ ప్రశ్నల వెనుక 150 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది. నాటి హైదరాబాద్ సంస్థానాన్ని బ్రిటీష్ ఇండియాతో కలపాలనే బలమైన ఆలోచనే నేటి తెలంగాణ రైల్వే నెట్‌వర్క్‌కు పునాది వేసింది. ఆ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం.

26
తెలంగాణలో మొదటి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్

మన తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ 'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్'. ప్రస్తుతం మనం చూస్తున్న బిజీ బిజీ సికింద్రాబాద్ జంక్షనే మన రాష్ట్రంలోనే ఫస్ట్ స్టేషన్. దీనిని 1874 అక్టోబర్‌లో అప్పటి హైదరాబాద్ నిజాం పాలకుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సిద్దిఖీ నిర్మించారు. 1870లోనే ఈ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రాగా, నిజాం రాజు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సుమారు నాలుగేళ్ల పాటు జరిగిన నిర్మాణ పనుల తర్వాత, 1874 అక్టోబర్ 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దానికి సంబంధించిన రైల్వే లైన్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. ఆ కాలంలోనే నిజాం శైలి మొఘల్, ఆసిఫ్ జాహి ఆర్కిటెక్చర్‌తో అద్భుతమైన మెయిన్ పోర్టికో, కాన్‌కోర్స్ రూమ్‌లను కట్టించారు.

36
అప్పట్లో అసలు ఎందుకు కట్టించారు?

నిజాం రాజులు ఈ రైల్వే స్టేషన్‌ను ఎందుకు కట్టించారనే దానికి ఒక బలమైన కారణం ఉంది. అప్పట్లో హైదరాబాద్ ఒక ల్యాండ్‌లాక్డ్ స్టేట్. అంటే చూట్టూ భూభాగం ఉన్న రాజ్యం. బాంబే లేదా మద్రాస్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లాలన్నా, వాణిజ్యం చేయాలన్నా సరైన రవాణా సౌకర్యం లేదు. అందుకే హైదరాబాద్ రాజ్యాన్ని గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే (GIPR) నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలని నిజాం డిసైడ్ అయ్యారు. అందుకోసం కొత్తగా 'సికింద్రాబాద్-వాడి' లైన్‌ను వేశారు. వాడి జంక్షన్ వద్ద బ్రిటీష్ ఇండియా రైల్వే లైన్‌తో మన హైదరాబాద్ స్టేట్‌ను లింక్ చేయడానికి ఈ సికింద్రాబాద్ స్టేషన్‌ను ఒక టెర్మినస్‌గా అంటే చివరి స్టేషన్‌గా నిర్మించారు.

46
ఫస్ట్ రైలు ఎప్పుడు నడిచింది? ఆ గ్యారెంటీ సిస్టమ్ ఏంటి?

స్టేషన్ బిల్డింగ్, ట్రాక్ పనులు 1874లోనే కంప్లీట్ అయినప్పటికీ, మొదటి రైలు మాత్రం వెంటనే నడవలేదు. రెండు సంవత్సరాల తర్వాత, అంటే 1876 అక్టోబర్‌లో సికింద్రాబాద్ నుండి మొదటి రైలు పట్టాలెక్కింది. వాడి-సికింద్రాబాద్ లైన్ అధికారికంగా ప్రారంభం కావడంతో, హైదరాబాద్ ప్రజలకు బాంబేతో నేరుగా రైలు కనెక్షన్ దొరికింది.

అయితే, దీని వెనుక ఒక బిజినెస్ డీల్ ఉంది. బ్రిటీష్ రైల్వే కంపెనీలు పెట్టిన పెట్టుబడికి నిజాం ప్రభుత్వం ప్రతి ఏటా 5 శాతం స్థిరమైన లాభాన్ని గ్యారెంటీ ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. దీనినే 'గ్యారెంటీ సిస్టమ్' అనేవారు. దీని కోసమే 1879లో 'నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే' (NGSR) అనే ప్రత్యేక సంస్థ ఏర్పాటైంది.

56
బొగ్గు గనుల కోసం జరిగిన విస్తరణ ఏంటి?

సికింద్రాబాద్ స్టేషన్ సక్సెస్ అయ్యాక, రైల్వే లైన్‌ను మరింత విస్తరించాలని నిజాం ప్రభుత్వం భావించింది. సాలార్ జంగ్ II కాలంలో ఈ లైన్‌ను వరంగల్ వరకు పొడిగించారు. ఆ తర్వాత 1888లో ఈ ట్రాక్‌ను డోర్నకల్ మీదుగా ఇల్లందు వరకు తీసుకెళ్లారు. ఇల్లందు వరకు ఎందుకు తీసుకెళ్లారంటే.. అక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి.

ఈ బొగ్గును మద్రాస్-కలకత్తా లైన్‌లోని బెజవాడ కు రవాణా చేసి, అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేయడానికి ఈ రైల్వే లైన్ ఎంతో హెల్ప్ అయ్యింది. అయితే ఈ క్రమంలోనే అప్పటి రైల్వే శాఖ మంత్రి అబ్దుల్ హక్ చేసిన 'దక్కన్ మైనింగ్ కంపెనీ కుంభకోణం' కూడా వెలుగుచూసింది.

66
చందా రైల్వే ఉద్యమం.. నాంపల్లి స్టేషన్ పుట్టుక

రైల్వే విస్తరణ కోసం నిజాం ప్రభుత్వం బ్రిటీష్ ఫైనాన్షియర్లతో చేసుకున్న ఒప్పందాలు రాష్ట్ర ఖజానాకు నష్టం తెచ్చేలా ఉన్నాయని అప్పట్లో పెద్ద గొడవ జరిగింది. దీనినే చందా రైల్వే స్కీమ్ నిరసన అంటారు. సరోజినీ నాయుడు తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ వంటి వారు నిజాం నిర్ణయాన్ని ఎదిరించి హైదరాబాద్ చరిత్రలోనే మొదటి రాజకీయ నిరసనకు తెరలేపారు.

ఆ తర్వాత కాలంలో, అంటే 1907లో చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మీటర్-గేజ్ లైన్ల కోసం 'హైదరాబాద్ డెక్కన్' (నాంపల్లి) రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో నిజాం పోలీసుల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రాయచూర్, కాజీపేట వంటి రైల్వే ప్లాట్‌ఫారమ్‌లే ఉద్యమకారులకు మెయిన్ అడ్డాలుగా మారాయి. నాడు నిజాం కట్టించిన ఆ ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే.. నేడు తెలంగాణ వ్యాప్తంగా 212 స్టేషన్లకు పైగా భారీ దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ ఏర్పడింది.

Read more Photos on
click me!

Recommended Stories