Driving license: ఈ త‌ప్పు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు కావ‌డం ఖాయం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Published : Jul 08, 2025, 02:34 PM IST

రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌ను పాటించ‌క‌పోతే అధికారులు చ‌లాన్లు విధిస్తార‌నే విష‌యం తెలిసిందే. అయితే చాలా మంది నిర్ల‌క్ష్యంతో చ‌లాన్లు చెల్లించ‌రు. ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

PREV
15
డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దు

వాహన చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం, మూడు నెలల వరకూ చ‌లాన్లు పెండింగ్‌లో ఉంటే సంబంధిత వ్య‌క్తి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయడం మొదలుపెట్టింది. 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్‌ మధ్యకాలంలో మొత్తం 18,973 లైసెన్సులను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

25
రూల్‌ బ్రేక్ చేస్తే ఇక మినహాయింపు ఉండ‌దు

మద్యం సేవించి వాహనం నడపడం, మాదక ద్రవ్యాల ప్రభావంలో డ్రైవింగ్‌, అధిక వేగం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై అధికారులు కఠినంగా స్పందిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రోడ్డు భ‌ద్ర‌తను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ట్రాన్స్‌పోర్ట్ శాఖ వెల్లడించింది.

35
ఈవీలకు భారీగా రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా ప్రభుత్వం భారీ మొత్తంలో రోడ్‌ ట్యాక్స్‌ను మాఫీ చేసింది. 2024 నవంబర్ 16 నుంచి 2025 జూన్ 30 వరకు, రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 49,633 ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.369.27 కోట్ల ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం అమలు చేసింది. ఇది గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా అభివర్ణించవచ్చు.

45
డ్రైవింగ్‌ టెస్ట్ ప్ర‌క్రియ‌లో మార్పులు

డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని గణనీయంగా మెరుగుపరచేందుకు ప్రభుత్వం 25 బైక్ ట్రాక్‌లు, 27 ఫోర్‌వీలర్ ట్రాక్‌లు, 5 భారీ వాహనాల ట్రాక్‌లను ఆధునికీకరించే దిశగా ప్రణాళికలు రూపొందించింది. వీటిని ఆటోమేటెడ్ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లుగా తీర్చిదిద్దేందుకు టెక్నాలజీని వినియోగించనున్నారు. ఫెయిర్, ట్రాన్స్‌పరెంట్ టెస్టింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

55
వాహనాలకు టీజీ కోడ్‌ మార్పులో పురోగతి

వాహనాల నంబరు ప్లేట్లలో TG కోడ్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. 2025 జూన్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 13.05 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లను టీజీ కోడ్‌తో మార్చినట్టు నివేదికలో స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories