Published : Jul 08, 2025, 02:32 PM ISTUpdated : Jul 08, 2025, 06:52 PM IST
ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్ సర్వీస్ నడవనుంది… గురుపౌర్ణమిలోగా తిరువణ్ణామలై చేరుకుని గిరి ప్రదక్షిణ చేయాలనుకునే తెలుగువారి కోసమే ఈ బస్ నడుపుతోంది తెలంగాణ ఆర్టిసి. ఇక IRCTC కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
Hyderabad to Arunachalam Yatra : దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలం చాలా ప్రత్యేకమైనది. ఇది తమిళనాడులో ఉన్నా తెలుగు ప్రజలే ఆ అరుణాచలేశ్వరుడిని ఎక్కువగా దర్శించుకునేది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి నిత్యం వేలాదిమంది తిరువణ్ణామలై వెళుతుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలంకు సరైన రవాణా సదుపాయాలు లేవు. దీంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
అయితే అరుణాచలం ఆలయానికి హైదరాబాద్ నుండి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ తెలిపింది. నగరం నుండి నేరుగా తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసింది. అయితే ఇది రెగ్యులర్ సర్వీస్ కాదు... భక్తుల ఎక్కువగా అరుణాచలంకు వెళ్లే ప్రత్యేక రోజుల్లోనే నడుస్తుంది. ఇలా ఇవాళ(మంగళవారం) రాత్రి హైదరాబాద్ నుండి ఓ బస్సు అరుణాచలం పయనం కానుంది. ఈ మేరకు ఆర్టిసి ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేాశారు.
25
హైదరాబాద్ నుండి అరుణాచలంకు స్పెషల్ బస్సు :
తెలంగాణ ఆర్టిసి హైదరాబాద్ నుండి అరుణాచలం ఆలయానికి ప్రత్యేక బస్సు నడుపుతోంది. ఈ గురువారం గురుపౌర్ణమి నేపథ్యంలో అరుణాచల గిరిప్రదక్షణ కోసం చాలామంది వెళుతుంటారు. ఇలా హైదరాబాద్ నుండి వెళ్లేవారికోసం దిల్ సుఖ్ నగర్ నుండి బస్సు సర్వీస్ ఏర్పాటుచేసింది. ఇది మంగళవారం అంటే ఇవాళ రాత్రి బయలుదేరుతుంది.
అయితే కేవలం అరుణాచలం మాత్రమే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోని కాణిపాకం, తమిళనాడులోకి గోల్డెన్ టెంపుల్ మీదుగా ఈ బస్ సర్వీస్ సాగుతుంది. అంటే ఈ దేవాలయాలను కూడా భక్తులు సందర్శించవచ్చు. ఇలా ఇవాళ బయలుదేరే బస్సు గురువారం (జులై 10) గురుపౌర్ణమి ఉదయానికి అరుణాచలం చేరుకుంటుందని హైదరాబాద్ ఆర్టిసి అధికారులు తెలిపారు.
35
హైదరాబాద్ నుండి అరుణాచలం టూర్ ప్యాకేజ్ ధర ఎంతటే..
ఇక అరుణాచలం గిరి ప్రదక్షణ అనంతరం స్వామివారి దర్శనం, రాత్రికి అక్కడే బస ఉంటుంది. తిరిగి శుక్రవారం అంటే జులై 11న అరుణాచలం నుండి బయలుదేరి శనివారానికి హైదరాబాద్ కు చేరుకుంటుంది. కాబట్టి అరుణాచలంకు వెళ్లాలనుకునే భక్తులు టికెట్ బుకింగ్ కోసం తెలంగాణ ఆర్టిసి అధికారిక వెబ్ సైట్ www.tgsrtcbus.in ను సందర్శించవచ్చు. లేదంటే 9959444165, 9346559649, 9666350995, 7382838010, 9959226249 నంబర్లకు సంప్రదించవచ్చిన హైదరాబాద్ ఆర్టిసి అధికారులు తెలిపారు.
ఇండియన్ రైల్వే కూడా అరుణాచలంకు వెళ్లే భక్తుల కోసం ఓ సూపర్ టూర్ ప్లాన్ రెడీ చేసింది. అరుణాచల మోక్ష యాత్ర పేరుతో IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అరుణాచలంతో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ ప్లాన్ ప్రకటించింది. హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఐదురోజుల పాటు సాగనుంది.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్రతి గురువారం ఈ యాత్ర ప్రారంభంఅవుతుంది. కాచిగూడ-పుదుచ్చెరి ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5గంటలకు యాత్రికులతో బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది... ఉదయం పుదుచ్చెరికి చేరుకుని పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది.
55
అరుణాచలం యాత్ర టికెట్ ధరలివే...
అక్కడినుండి అరుణాచలం ఆలయానికి ప్రయాణం ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షణ, అరుణాచలేశ్వరస్వామి దర్శనం చేసుకోవచ్చు... రాత్రి ఇక్కడే బస. తిరిగి ఉదయం కాంచీపురం తీసుకెళతారు. అక్కడ కామాక్షి అమ్మన్ దర్శనం, ఇతర ఆలయాల సందర్శన ఉంటుంది. అక్కడి నుండి హైదరాబాద్ కు తిరుగుపయనం. ఇలా ఐదురోజుల పాటు అరుణాచలంతో పాటు ఇతర ప్రాంతాల యాత్ర సాగుతుంది.