Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? ఇక భారీ వర్షాలతో అల్లకల్లోలమేనా..?

Published : May 05, 2026, 05:47 PM IST

IMD Weather Update : రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది… భారీ వర్షాలు తప్పవని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే మాత్రం అల్లకల్లోలం తప్పదు.

PREV
15
పొంచివున్న తుపాను ముప్పు..?

Rain Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వేసవికాలం కావడంతో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి... ఇక సాయంత్రం అయ్యిందంటే వాతావరణం చల్లబడి మేఘాలు కమ్ముకుంటున్నాయి... చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది... ఇదే సమయంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ప్రజలను కంగారుపెడుతోంది.

25
అల్పపీడనం తుపానుగా మారుతుందా...?

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని కొన్ని గ్లోబల్ వెదర్ మోడల్స్ హెచ్చరిస్తున్నారు. మే 8, 9 తేదీల్లో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఇది వాయుగుండంగా, తుపానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నాయి. మే రెండో వారంలో అంటే మే 11 నుండి మే 15 మధ్య కేరళ తీరానికి సమీపంలోని బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఇది క్రమక్రమంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి

35
ఐఎండి అంచనాలేంటి..?

ప్రస్తుతానికి భారత వాతావరణ శాఖ (IMD) బంగాళాఖాతంలో తుపాను ఏర్పడుతుందని ఎటువంటి అధికారిక ప్రకటన లేదా హెచ్చరిక జారీ చేయలేదు. కానీ వర్షాల తీవ్రత పెరుగుతుందని మాత్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. పిడుగుల ప్రమాదం కూడా పొంచివుందని హెచ్చరిస్తోంది.

అయితే తుపాను ముప్పు పొంచి ఉందన్న ముందస్తు అంచనాల నేపథ్యంలో ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచడం, తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి.

45
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (మే 5, మంగళవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి... రాత్రికి ఈ వానలు మరింత జోరందుకునే అవకాశాలున్నట్లు APSDMA హెచ్చరించింది.

55
తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో కూడా ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.... ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇక సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్న పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, జిల్లాల్లో రాబోయే రెండుమూడు గంటల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్ లో ఈ సాయంత్రం ఆకాశం పాక్షికంగా మేఘాలతో కమ్ముకుని ఉంటుందని... కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. వర్ష సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి... లేదంటో ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories