Chanchalguda : జైలుకు వెళ్తే రూ.500.. బయటకు వస్తే రూ.1000 ఫైన్! ఏంటా వింత రూల్?

Published : May 03, 2026, 05:59 PM IST

Chanchalguda Central Jail: చంచల్‌గూడ జైలులో 'ఒక రోజు జైలు జీవితం' స్కీమ్ ప్రారంభం అయింది. రూ.500 చెల్లిస్తే చాలు, మీరు కూడా ఖైదీలా 24 గంటలు జైలులో గడపవచ్చు. ఎందుకు ఈ వింత నిర్ణయం తీసుకున్నారు?

PREV
14
రూ. 500 కి జైలు టికెట్.. చంచల్‌గూడ జైలులో వింత ఆఫర్!

సాధారణంగా ఎవరైనా జైలుకు వెళ్లాలంటే క్రైమ్ చేయాలి, లేదంటే పోలీసులకు తప్పుడు పనులు చేస్తూ దొరకాలి. కానీ, ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా మీరు జైలుకు వెళ్లొచ్చు! వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే "ఒక రోజు జైలు జీవితం అనే ప్రోగ్రామ్.

మే నెల నుండి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు లోపల వాతావరణం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించవచ్చు. అయితే ఇది ఏదో టూరిస్ట్ స్పాట్ అనుకుంటే పొరపాటే.. ఇక్కడ నిబంధనలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.

24
రూ. 500 చెల్లిస్తే చాలు.. ఖైదీ డ్రెస్ రెడీ

ఈ కొత్త అనుభవం కోసం మీరు కేవలం రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి మీరు జైలు గేటు దాటి లోపలికి వెళ్లారంటే, మీ స్వేచ్ఛకు బ్రేక్ పడినట్లే. మీ దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్, వాచ్, పర్సు, చివరకు మీ సొంత బట్టలను కూడా అధికారులు తీసేసుకుంటారు. వాటికి బదులుగా జైలు అధికారులు ఇచ్చే ఖద్దరు యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. 24 గంటల పాటు మీరు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపాలి.

34
మెనూలో ఏముంటుంది? విలాసాలకు నో ఎంట్రీ మరి

జైలుకు వెళ్లాక అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ అస్సలు వుండదు. అధికారులు ఇచ్చే మెనూనే ఫాలో అవ్వాలి.

• ఉదయం: ఖైదీలతో పాటే నిద్రలేవాలి.

• టిఫిన్ & భోజనం: జైలు మాన్యువల్ ప్రకారం వండే పప్పు, అన్నం, చారు మాత్రమే ఇస్తారు.

• నిద్ర: ఏసీలు, మెత్తటి పరుపులు ఉండవు. నేలపై చాప వేసుకుని, ఒక దుప్పటి, దిండుతో కటిక నేల మీద పడుకోవాల్సి వుంటుంది.

44
జైలులో పని చేయాల్సిందే మరి..

కేవలం గదిలో కూర్చుని టైమ్ పాస్ చేస్తామంటే కుదరదు. అసలైన ఖైదీలు చేసే పనులన్నీ మీరు కూడా చేయాలి. జైలు ఆవరణను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం లేదా వంట గదిలో సహాయం చేయడం వంటి పనులు కేటాయిస్తారు. జైలు అధికారులు ఎంత కఠినంగా ఉంటారో, అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుందో ఈ 24 గంటల్లో మీకు అర్థమవుతుంది.

ఈ వింత ప్రయోగం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

జైలు జీవితం అంటే చాలా మందికి సినిమాల్లో చూపించేదే తెలుసు. కానీ స్వేచ్ఛ లేని జీవితం ఎంత భారంగా ఉంటుందో యువతకు, సామాన్యులకు అర్థం కావాలని జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నేరాల ఆలోచన ఉన్నవారిలో మార్పు తీసుకురావడానికి, జైలు అంటే భయం కలిగించడానికి ఈ షాక్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది అవసరమా? నెటిజన్ల నుంచి వైరల్ రియాక్షన్

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు "క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం" అని అంటుంటే, మరికొందరు మాత్రం "జైలు అనేది శిక్షలు అమలు చేసే ప్రాంతం, దాన్ని టూరిజం సెంటర్ చేయడం ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. జైలు శిక్ష పట్ల భయం పోయే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ జైలు టూరిజంకు హైదరాబాద్ జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Read more Photos on
click me!

Recommended Stories