MLA Sri Ganehsh: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడి యత్నం జరిగింది. దుండగులు కాన్వాయ్‌ను అడ్డుకుని గన్‌మెన్‌ల వెపన్స్ లాక్కొనేందుకు ప్రయత్నించారు.
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం తార్నాకాలోని ఆర్టీసీ హాస్పటల్ సమీపంలో చోటు చేసుకుంది. దాదాపు 50 మంది దుండగులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ని వెంబడిస్తూ, వాహనంపైకి దూసుకువచ్చారు.
25
ఎమ్మెల్యే శ్రీగణేష్ గన్‌మెన్ వెపన్స్ లాక్కొనే ప్రయత్నం
ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు, గన్‌మెన్ చేతిలో ఉన్న వెపన్స్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని గన్‌మెన్‌లు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కారులోంచి బయటకు రాకుండా ఉన్నానని తెలిపారు.
35
పోలీసులు ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే తన కాన్వాయ్ నుంచి బయటికి రాకుండా ఉన్నట్టు చెప్పారు. అనంతరం దుండగుల బారి నుంచి తప్పించుకుని ఆయన 200 మీటర్ల దూరంలోని ఓస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ (OU PS)కి చేరుకుని అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన మాణికేశ్వర్ నగర్ ప్రాంతంలో బోనాల జాతరకు వెళ్తుండగా చోటుచేసుకుంది. బోనాల వేడుకల కోసం వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్ వద్ద దుండగులు దూకుడుగా వచ్చి.. వారిని అడ్డుకుని దాడికి యత్నించారు. ఇది రాష్ట్రంలో రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
55
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఘటనాస్థలానికి చేరుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఎవరు, ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజీలు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరూ అరెస్టు కాలేదు. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.