తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

First Published Jan 5, 2024, 3:10 PM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో బీఆర్ఎస్ లో  ఎమ్మెల్సీ పదవుల కోసం  నేతల మధ్య పోటీ నెలకొంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.  గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  ఎన్నికల్లో  తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే
 

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

స్టేషన్ ఘన్ పూర్,  హుజూరాబాద్  అసెంబ్లీ స్థానాల నుండి  కడియం శ్రీహరి,  పాడి కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో  ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు   ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. 

also read:వైఎస్ఆర్‌టీపీ విలీనం: కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి  64 స్థానాలు ఉన్నాయి.  కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సీపీఐకి ఒక్క స్థానం ఉంది. దీంతో   ఈ కూటమి బలం  65 స్థానాలకు చేరింది.  భారత రాష్ట్ర సమితి బలం 39 స్థానాలు. భారతీయ జనతా పార్టీ బలం   ఎనిమిది స్థానాలు, ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమిన్ (ఎంఐఎం) బలం ఏడు. అయితే  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రెండు స్థానాలకు  ఈ నెల  29న పోలింగ్ ఉంది.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

 ఒక్క ఎమ్మెల్సీ స్థానం  దక్కించుకోవాలంటే  కనీసం 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్న బలం ఆధారంగా రెండు పార్టీలకు ఒక్కో స్థానం దక్కనుంది. అయితే  బీఆర్ఎస్ తరపున  కేసీఆర్ కోసం తన ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన  గంప గోవర్ధన్ రేసులో  ముందు వరుసలో ఉన్నారు. మరో వైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం  సీటు త్యాగం చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  కడియం శ్రీహరి కోసం  సీటు త్యాగం చేసిన తాటికొండ రాజయ్యలు కూడ  ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. 

also read:మైదుకూరు నుండి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి: టీడీపీ టిక్కెట్టు దక్కేనా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడ ఎమ్మెల్సీ పదవుల్లో  పోటీ పడుతున్నారు.

also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో 
 గవర్నర్ కోటా కింద  కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ ల పేర్లను కూడ గతంలో  కేసీఆర్ సిఫారసు చేశారు. అయితే  ఈ ఇద్దరి పేర్లను  గవర్నర్ తిరస్కరించారు. దరిమిలా ఈ ఇద్దరిలో ఒక్కరిని ఎమ్మెల్యే కోటా కింద  శాసనమండలికి పంపాలనే  యోచనలో గులాబీ బాస్ ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.  

also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు స్థానాలకు  కాంగ్రెస్ పోటీ పెడుతుందా, ఒక్క స్థానానికి నామినేషన్ వేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు స్థానాలకు  కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టే అవకాశం ఉండకపోవచ్చని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే


తెలంగాణలో అధికారం కోల్పోవడంతో గవర్నర్ కోటా కింద  బీఆర్ఎస్ కు రెండు స్థానాలు దక్కవు. మహబూబ్ నగర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నల్గొండ, వరంగల్ , ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికల 
షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

also read:కొత్త టీమ్‌ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు

click me!