తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

First Published | Jan 5, 2024, 1:45 PM IST


తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో   కాంగ్రెస్ లో ఆశావాహులు  తమకు పదవుల కోసం పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో  ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  షెడ్యూల్  ఈ నెల  4వ తేదీన విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ కసరత్తు: ఐఎఎస్‌ల అధ్యయనం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటేడ్ పదవుల కోసం  ఆ పార్టీలో  పలువురు నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.  నామినేటేడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారు. పాార్టీ కోసం పనిచేసిన వారికి ఈ పదవులు కట్టబెట్టాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

also read:ముఖేష్ అంబానీని దాటిన గౌతమ్ అదానీ: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు


తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే


అసెంబ్లీ ఎన్నికల్లో  ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు సమర్పించారు.ఈ రాజీనామాలతో  ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ పదవులకు  ఈ నెల  29న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

మరో వైపు గవర్నర్ కోటా కింద  రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరో వైపు  నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి  పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మహబూబ్ నగర్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దరిమిలా  ఈ స్థానానికి కూడ  త్వరలోనే  షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. కల్వకుర్తి నుండి  ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో  కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

కాంగ్రెస్ నుండి  అద్దంకి దయాకర్, చిన్నా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్, వేణుగోపాల్, బెల్లయ్య నాయక్, షబ్బీర్ అలీ, మధు యాష్కి, అజారుద్దీన్,ఫిరోజ్ ఖాన్  లు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ పదవులకు  షెడ్యూల్ విడుదలైంది. గవర్నర్ కోటాలో  రెండు  స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయి.  స్థానిక సంస్థల, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. 

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి అసెంబ్లీ టిక్కెట్టును త్యాగం చేసినందును ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అద్దంకి దయాకర్  పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు .వనపర్తి అసెంబ్లీ స్థానంలో  తొలుత మాజీ మంత్రి చిన్నారెడ్డి  పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది.ఆ తర్వాత చిన్నారెడ్డి స్థానంలో  మరొకరికి టిక్కెట్టు కేటాయించింది. దీంతో ఎమ్మెల్సీగా  చిన్నారెడ్డి  ఆశిస్తున్నారు.

also read:మైదుకూరు నుండి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి: టీడీపీ టిక్కెట్టు దక్కేనా?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

మైనార్టీ కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ,  ఫిరోజ్ ఖాన్ కూడ  ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు.మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో  అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ పార్టీ మాత్రం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించలేదు. దరిమిలా మహేష్ కుమార్ గౌడ్  ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశిస్తున్నారు. 

also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

 ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్, వేణుగోపాల్, బెల్లయ్య నాయక్ లు కూడ ఎమ్మెల్సీ కోసం  పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి ఓటమి పాలైన మధు యాష్కీ కూడ  ఎమ్మెల్సీ స్థానంపై  ఆశగా ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం

Latest Videos

click me!