తెలంగాణలో కూడా వాతావరణం మారింది. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో గాలిలో తేమ శాతం పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది. పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు పడిపోగా, రాత్రి వేళల్లో 22 నుంచి 23 డిగ్రీలు నమోదుకావచ్చు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నం వరకు అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షం పడవచ్చు. అయితే నగరం మొత్తంగా కాకుండా స్థానిక పరిస్థితుల బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ వర్షాలు పరిమితం కానున్నాయి.