తెలంగాణలో వానలు.. హైదరాబాద్ వాసులకు అలర్ట్
తెలంగాణలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. గురువారం సాయంత్రం మొదలయ్యే జల్లులు జూన్ 5 తెల్లవారుజాము వరకు కంటిన్యూగా పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సి పురం, శేరిలింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, దమ్మాయిగూడ వంటి ఐటీ కారిడార్, ప్రధాన ప్రాంతాల్లో సాయంత్రం పూట వానలు పడనున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్‌లో ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నందున, జనాలు తమ ప్రయాణాలను వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.