Amrapali : చిన్న వయసులోనే సివిల్స్ ర్యాంక్ ... కానీ సొంత రాష్ట్రంల్లో పోస్టింగ్ వద్దనుకున్న తెలుగమ్మాయి ఎవరో తెలుసా?

Published : Jul 15, 2025, 01:46 PM IST

ఆమె అతి చిన్న వయసులోని సివిల్స్ ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి. కానీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ను కాదనుకుని క్యాట్ లో పోరాడిమరీ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా? 

PREV
15
సొంత రాష్ట్రంలో పోస్టింగ్ వద్దనుకున్న తెలుగు ఐఏఎస్

Amrapali IAS : చాలామంది అధికారులు వస్తుంటారు, పోతుంటారు... కానీ కొంతమంది మాత్రమే ప్రజలకు గుర్తుండిపోతారు. ఏదో పనిచేయాలి కాబట్టి చేసేవారు కొందరయితే... ఎంతో ప్యాషన్ తో చేసే పనిచేసేవారు మరికొందరు. ఇంకొందరు అధికారులు తమ పాలనాపరమైన నిర్ణయాలు, చర్యలతో ప్రజల జీవితాలనే మార్చేస్తుంటారు. ఇలా ప్రజల మనసులు గెలుచుకున్న అతి తక్కువమంది తెలుగు అధికారుల్లో ఆమ్రపాలి ఒకరు.

తెలంగాణ క్యాడర్ కు చెందిన ఈ ఐఎఎస్ అధికారిణి పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, ఎన్నికల కమీషన్ లో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నపుడు కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా, తర్వాత ప్రధాని కార్యాలయ డిప్యూటీ సెక్రటరీగా... ఇలా అత్యున్నత స్థానాల్లో పనిచేసారు. ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు... అందుకే ఏ ఐఎఎస్ కు రాని ప్రత్యేక గుర్తింపు మన తెలుగమ్మాయి ఆమ్రపాలికి లభించింది.

ఇంత అద్భుమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆమ్రపాలి ఐఏఎస్ పోస్టింగ్ ఇటీవల వివాదాస్పదంగా మారింది. తెలంగాణ కేడర్ కు చెందిన ఆమెను ఆంధ్ర ప్రదేశ్ కు బదిలీచేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ (DOPT) నిర్ణయం తీసుకుంది... కానీ ఆమె ఇందుకు అంగీకరించలేదు. క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) లో పోరాడిమరీ తెలంగాణలో తిరిగి పోస్టింగ్ పొందారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా కొనసాగుతున్నారు.

25
ఆమ్రపాలి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ వద్దనుకున్నారా?

ఎవరైనా సొంత రాష్ట్రంలో ఉద్యోగం లభిస్తే ఎగిరి గంతేస్తారు... చాలామంది తమ స్వస్థలానికి దగ్గర్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తుంటారు. కానీ ఆమ్రపాలి మాత్రం సొంత రాష్ట్రంలో పోస్టింగ్ వస్తే వద్దనుకున్నారు... క్యాట్ లో పోరాడిమరీ తిరిగి తెలంగాణలో మారారు. కారణం ఏంటో తెలియదుగానీ ఆమె సొంత రాష్ట్రంలో పోస్టింగ్ వద్దనుకోవడం ఆసక్తికర అంశం.

తెలంగాణ నుండి ఏపీకి బదిలీ అయినతర్వాత ఆమ్రపాలికి పర్యాటక శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ టూరిజం ఎండీగా, టూరిజం అథారిటీ సీఈవో గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆమ్రపాలి మాత్రం ఏపీలో పనిచేసేందుకు అస్సలు అంగీకరించలేదు... కేవలం నాలుగు నెలలు మాత్రమే అక్కడ పనిచేసారు. క్యాట్ తీర్పుతో ఆమ్రపాలికి తిరిగి తెలంగాణ కేడర్ దక్కింది.

35
ఆమ్రపాలి స్వస్థలం ఏది?

కాట ఆమ్రపాలి 1982, నవంబర్ 4న ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు. ఈమె తండ్రి కాట వెంకట్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పద్మావతి. మంచి విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఆమ్రపాలి చదువులో బాగా చురుగ్గా ఉండేవారు... ఆమె ప్రాథమిక విద్యాభ్యాసమంతా విశాఖలోనే సాగింది.

ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ లో సీటు సాధించారు ఆమ్రపాలి. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసారు. తర్వాత బెంగళూరులోని IIM లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసారు. ఇలా ఉన్నత చదువుల తర్వాత ఆమె సివిల్స్ వైపు అడుగులేసారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 39వ ర్యాంకు సాధించి 2010 బ్యాచ్ ఐఏఎస్ గా నియమితులయ్యారు. అతి చిన్న వయసులో సివిల్స్ ర్యాంకు సాధించినవారిలో ఆమ్రపాలి ఒకరు.

45
కలెక్టర్ ఆమ్రపాలికి ప్రత్యేక గుర్తింపు

ఐఏఎస్ శిక్షణ అనంతరం సొంతరాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే ఆమ్రపాలికి పోస్టింగ్ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో సబ్ కలెక్టర్ గా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసారు. రాష్ట్ర విభజన తర్వాత ఈమెకు తెలంగాణ కేడర్ దక్కింది… 2015 లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా, 2016 లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు కలెక్టర్ గా వ్యవహరించారు. ఈ సమయంలోనే ఆమ్రపాలి ఐఏఎస్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది.

55
సబ్ కలెక్టర్ నుండి పిఎంవోకు ఆమ్రపాలి ప్రయాణం..

ఆమ్రపాలి పనితీరును గుర్తించిన ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యతలు అప్పగించింది. జిహెచ్ఎంసి మున్సిపల్ కమీషనర్ గా వ్యవహరించారు. అనంతరం ఎన్నికల కమీషన్, కేంద్ర హోంశాఖ, ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2023 లో తిరిగి గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) బాధ్యతలు చేపట్టారు. తర్వాత తిరిగి జిహెచ్ఎంసి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు... ఇక్కడ పనిచేస్తుండగానే ఏపీకి బదిలీఅయ్యారు. అక్కడ కేవలం మూడునెలలు మాత్రమే పనిచేసి క్యాట్ తీర్పుతో తిరిగి తెలంగాణకు వచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories