Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు

Published : Dec 12, 2025, 04:20 PM IST

Amazon: హైద‌రాబాద్‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతోంది. ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అమెజాన్ వ్యాపారాన్ని భారీగా విస్త‌రించేందుకు ప్లాన్ చేస్తోంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 

PREV
15
హైద‌రాబాద్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

టెక్ దిగ్గజం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (AWS) హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. వచ్చే 14 ఏళ్లలో USD 7 బిలియన్ (దాదాపు రూ. 58,000 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టేందుకు AWS తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం డిసెంబర్ 8–9 తేదీల్లో జరిగిన “తెలంగాణ రైజింగ్‌” గ్లోబల్ సమిట్‌లో ఫైనల్ అయింది.

25
తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

ఈ ఒప్పందం ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం AWSకి అవసరమైన భూమి, విద్యుత్, కనెక్టివిటీ, ప్రత్యేక సపోర్ట్ వంటి సౌకర్యాలు అందిస్తుంది. ఇవి AWS డేటా సెంటర్లను హైదరాబాద్‌లో త్వరగా విస్తరించేందుకు కీలకంగా ఉండనున్నాయి. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌” చర్యల ద్వారా AWS ఆపరేషన్లు మరింత వేగంగా సాగుతాయి.

35
భారత్‌కు కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ AWS

కొత్త పెట్టుబడి తర్వాత హైదరాబాద్‌లోని AWS రీజియన్‌ దేశవ్యాప్తంగా.. క్లౌడ్ సేవలు, కృత్రిమ మేథస్సు (AI), స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలు, ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌ల‌ను కంట్రోల్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఇప్పటికే AWSకు ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది.

45
తెలంగాణపై న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నం

ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇది తెలంగాణ పరిపాలనపైన, ఆర్థిక దృష్టికోణంపైన ప్రపంచ దిగ్గజ కంపెనీల నమ్మకానికి నిదర్శనం అన్నారు. “అమెజాన్‌ చేసిన ఈ భారీ కమిట్‌మెంట్‌ తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మా లక్ష్యానికి పెద్ద బలం,” అని సీఎం పేర్కొన్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్‌కు ప్రత్యక్ష ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

55
డిజిటల్ మౌలిక వసతుల్లో తెలంగాణ ముందంజ

తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, AWS లాంటి గ్లోబల్ కంపెనీలు వేగంగా ఎదగడానికి అవసరమైన అన్ని విధాలా సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ డిజిటల్‌, AI ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో ముఖ్య స్థానం దక్కించుకుంటుందని అన్నారు. AWS ఇండియా & సౌత్ ఏషియా అధ్యక్షుడు సందీప్ దత్తా మాట్లాడుతూ, “టెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే ప్రయాణంలో భాగం కావడం మాకు ఆనందంగా ఉంది. ఉద్యోగాలు సృష్టించడం, స్థానిక వ్యాపారాలను సపోర్ట్ చేయడం, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడడం మా లక్ష్యం,” అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories