హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?

Published : Dec 12, 2025, 02:24 PM IST

Hyderabad: షాపింగ్ మాల్స్‌కు పెట్టింది పేరైన హైద‌రాబాద్‌లో మ‌రో భారీ షాపింగ్ మాల్ వ‌చ్చేసింది. రూ. 1200 కోట్లతో నిర్మాణం జ‌రుపుకున్న ఈ అద్భుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇంత‌కీ మాల్ ఎక్క‌డుంది.? దీని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
1,200 కోట్లు పెట్టుబడితో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్

లేక్ షోర్ సంస్థ హైదరాబాద్‌లో తన ఆరవ మాల్‌ను ప్రారంభించింది. కుకట్‌పల్లి, బాలానగర్ రహదారి కలిసే వై-జంక్షన్ ప్రాంతంలో ఏర్పాటైన ఈ మాల్ దాదాపు 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నిర్మాణానికి దాదాపు 1,200 కోట్లు ఖర్చయిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అశ్విన్ పూరి తెలిపారు. హైదరాబాద్‌లో పెద్ద రిటైల్ స్థలాలు చాలావరకు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కే పరిమితమై ఉండడంతో, నగరంలోని పశ్చిమ ప్రాంతాలకు పెద్ద ఫార్మాట్ షాపింగ్ కేంద్రం అవసరం అని 2017 నుంచే పరిశీలించినట్టు ఆయన చెప్పారు. ఈ మాల్‌లో దాదాపు 250 దుకాణాలు ఉంటాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందిన NEXT, దుబాయ్‌కి చెందిన Babyshop వంటి కొన్ని బ్రాండ్‌లు తొలిసారి హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.

25
మెట్రో కనెక్టివిటీ, పార్కింగ్ వంటి సౌకర్యాలు

మాల్‌కు నేరుగా వై-జంక్షన్ మెట్రో స్టేషన్‌ నుంచి బ్రిడ్జి కలుపుతూ ప్రత్యేక ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. అదనంగా, 1,500–1,800 వాహనాలకు పార్కింగ్ స్థలం కల్పించారు. భద్రతా పరంగా ఆధునిక ఫైర్ సిస్టమ్స్, 1,000 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుసరించామని అశ్విన్ పూరి తెలిపారు.

35
100కిపైగా దుకాణాలు, ప్రీమియం PVR అనుభవం

ఇది కేవలం రిటైల్ సెంటర్ మాత్రమే కాదు, పెద్ద ఎంటర్టైన్‌మెంట్ హబ్ కూడా. పీవీఆర్ సంస్థ ఇక్కడ 9 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ ఏర్పాటు చేసినది, అందులో IMAX ఆడిటోరియం కూడా ఉంది. అదనంగా, పిల్లల కోసం ప్రత్యేక కిడ్స్ స్క్రీన్ ఉండ‌నుంది. ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, ఫుడ్ బ్రాండ్‌లు అయిన హెచ్ అండ్ ఎమ్‌, లైఫ్‌స్టైల్‌, మ్యాక్స్‌, ఆర్ అండ్ బీ, హోమ్ సెంట‌ర్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్ వంటి అనేక బ్రాండ్‌లు ఉండ‌నున్నాయి. అలాగే 40 కంటే ఎక్కువ ఫుడ్ అవుట్‌లెట్లు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ రోజు 150కు పైగా దుకాణాలు ఒక్కరోజే ఓపెన్ కానున్న‌ట్లు కంపెనీ ప్రకటించింది.

45
The Park – ఓపెన్ ఏరియా కమ్యూనిటీ స్థలం

ఈ మాల్‌లో ప్రధాన ఆకర్షణ Level-5లో నిర్మించిన “The Park” అనే ఓపెన్ ఏరియా. కుటుంబాలు కలిసి విశ్రాంతి తీసుకునేలా, పిల్లల ఆట స్థలాలు, సిటింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతంలో పెద్ద ఫార్మాట్ మాల్ ఏదీ రాకపోవడంతో, వై-జంక్షన్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది సౌకర్యంగా మారనుంది. పర్యావరణ పరిరక్షణ ప్రమాణాల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గోల్డ్ ప్రీసర్టిఫికేషన్ కూడా లభించింది.

55
ట్రాఫిక్ పై ఆందోళనలు

మాల్ ప్రారంభంపై నగరవాసుల్లో ఉత్సాహం పెరుగుతున్నప్పటికీ, ట్రాఫిక్‌పై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుకట్‌పల్లి ప్రాంతం సాధారణ రోజుల్లోనే అధిక వాహన రద్దీతో ఉంటుంది. వై జంక్ష‌న్ ద‌గ్గ‌ర స‌హ‌జంగా ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇటీవ‌ల లులు మాల్ ప్రారంభ సమయంలో భారీ ట్రాఫిక్ కష్టాలు ఎదురుకావడంతో, వై-జంక్షన్ మాల్ ప్రారంభం స‌మ‌యంలో కూడా అలాంటి స‌మ‌స్య రావొచ్చ‌ని ఆందోళ‌న చెందుఉన్నారు. అయితే మెట్రో కనెక్టివిటీ కారణంగా కొంత మేర ట్రాఫిక్ భారం తక్కువయ్యే అవకాశం ఉందని అధికారుల అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories