Tealgana And Andhra Pradesh Vegetable Price : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి… సరైన ధరకు కొనుగోలుచేసి డబ్బులు ఆదా చేసుకొండి.
Today Vegetable Price : సామాన్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను నిత్యావసర వస్తువులు చాలా ప్రభావితం చేస్తాయి. ధరలు పెరిగితే ఉక్కిరిబిక్కిరి అవుతారు... ధరలు తగ్గితే డబ్బులు ఆదా అవుతున్నాయని సంతోష పడతారు. అయితే దేనికోసం ఖర్చు చేసినా చేయకున్న బ్రతికేందుకు మాత్రం పూడుపూటలా ఆహారం కావాలి... ధరలు ఎలా ఉన్నా దీనికోసం మాత్రం ఖర్చు చేయాల్సింది. అందుకే కూరగాయల ధరలు తక్కువగా ఉంటే ప్రజలకు ఆనందం... ఎక్కువగా ఉంటే ఆందోళన.
26
కూరగాయల మార్కెట్స్ లో ధరలు
హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు నగరాల్లో సాధారణంగా వీకెండ్ లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఉద్యోగులకే కాదు గృహిణులకు కూడా వారాంతంలో ఖాళీ సమయం దొరుకుతుంది కాబట్టి కూరగాయల మార్కెట్ కు వెళుతుంటారు... వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం... తద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
36
టమాటా ధర ఎలా ఉంది...
తెలుగువారు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ టమాటా. ఇది లేనిదే తెలుగువారి కిచెన్ ఉండదు అనడంతో అతిశయోక్తి లేదు. కూరగాయల లిస్ట్ లో మొదట ఉండేది... మార్కెట్ కు వెళ్లాక మొదట కొనేది టమాటానే. అందుకే టమాటా ధర తక్కువగా ఉంటేచాలు... కూరగాయల ధరలన్ని తక్కువగా ఉన్నట్లే భావిస్తారు సామాన్య ప్రజలు. ఇటీవల పైపైకి ఎగబాకుతూ కిలో రూ.50 కి చేరిన టమాటా ప్రస్తుతం దిగివచ్చింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా రూ.20 నుండి రూ.30 లోపు ఉంది... గ్రామాల్లో ఇంకొంచెం తక్కువగా ఉంటుంది.
ఉల్లిపాయలు కూడా తెలుగువారి వంటకాల్లో ఉండాల్సిందే... వంటింట్లో ఇది లేనిదే పనిసాగదు. పప్పు, రసం, కూరలు, బిర్యానీలు... ఇలా ప్రతిదాంట్లో ఉల్లిపాయలు ఉండాల్సిందే. అందుకే మార్కెట్ లో ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు తక్కువగా ఉన్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.20-30 పలుకుతోంది... రూ.100 కు 5-6 కిలోల ఉల్లిపాయలు అమ్ముతున్నారు.
ఉల్లి రైతుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. కనీస మధ్దతుధర కూడా లభించడంలేదు... కిలో రూ.5 కు అమ్ముకోవాల్సి వస్తోంది. కానీ ఇది వినియోగదారులకు చేరేసరికి రూ.20-30 కి పెరుగుతోంది. అంటే అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతుండగా మధ్యలో దళారులు లాభపడుతున్నారు.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.