తెలంగాణలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉండగా తాజాగా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫ్రీ టికెట్‌ను జారీ చేస్తోంది. అయితే ఇదే తరుణంలో మహిళలకు ఓ సమస్య తలెత్తుతోంది. అదేంటంటే..
ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. బస్సు ఎక్కిన మహిళలు ఆధార్ కార్డును చూపిస్తే కండక్టర్లు జీరో టికెట్‌ను జారీ చేస్తున్నారు. ఇతర ఐడీ ప్రూఫ్‌లను స్వీకరిస్తున్నా మెజారిటీ మహిళలు మాత్రం ఆధార్ కార్డునే ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు వినియోగంలో తెలంగాణలో మహిళలకు ఓ సమస్య తలెత్తుతోంది.
DID YOU KNOW ?
ఫొటో కూడా
ఆధార్ కార్డులో పాత ఫొటోలు ఉంటున్నా కొందరు కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి ఫొటోలను కూడా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
25
ఆంధ్రప్రదేశ్ ఉంటే నిరాకరణ
తెలంగాణలో నివాసం ఉంటున్న కొందరు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌తోనే ఆధార్‌ను ఉపయోగించుకుంటున్నారు. నిజానికి తెలంగాణలోని అడ్రస్ ఉన్నా రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌గా ఉంటుంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోవడంతో కొన్ని బస్సుల్లో కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇదే అంశం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది.
35
అధికారిక ప్రకటన మాత్రం లేదు
ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో "ఆంధ్రప్రదేశ్" అని ఉంటే చెల్లుబాటు కాదన్న నిబంధనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకనట మాత్రం లేదు. అయితే కొందరు కండక్టర్లు మాత్రం "తెలంగాణ చిరునామా తప్పనిసరి" అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు బస్సుల్లో ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని నోటీసులు కూడా అతికిస్తున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆధార్ సేవా కేంద్రాల్లో సింపుల్‌గా కార్డును అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే చిరునామా విభాగంలో ఉన్న "ఆంధ్రప్రదేశ్" ఆటోమెటిక్‌గా తెలంగాణలోకి మారిపోతుంది. ఇప్పటికే చాలా మంది మహిళలు తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకుంటున్నారు.
55
ఫొటో కూడా
ఇక కొందరు మహిళలు చాలా ఏళ్లుగా తమ ఆధార్ కార్డులో ఫొటోను అప్డేట్ చేసుకోవడం లేదు దీంతో ఆధార్ కార్డులు మొదటగా తీసుకున్నప్పుడు చిన్నారుల ఫొటోలు ఉంటున్నాయి. ఇప్పటికీ ఆ పాత కార్డులనే వాడుతున్న వారు ఉన్నారు. వయసు పెరగడంతో ఆ ఫొటోలు వ్యక్తిని సరిగ్గా గుర్తించలేకపోవటంతో కండక్టర్లు "ఇది మీ కార్డేనా?" అని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా కూడా మహిళలు టికెట్ కొనాల్సి వస్తోంది. దీంతో ఫొటో కూడా అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.