2026 సెలవుల లిస్ట్ ఇదే... ఏ నెలలో ఎన్నిరోజులు హాలిడేస్ వస్తున్నాయో తెలుసా?

Published : Nov 18, 2025, 06:11 PM ISTUpdated : Nov 18, 2025, 06:27 PM IST

Holidays in 2026 : తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారమిది. 2026 ఎన్నిరోజులు సెలవులున్నాయి? ఏ నెలలో ఏ తేదీన సెలవు ఉంటుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలవుల పరిస్థితి ఏంటి? 

PREV
111
2026 లో సెలవులే సెలవులు

2026 Holidays : 2025 ముగింపుకు చేరుకున్నాం... మరో నెలపది రోజుల్లో 2026 లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది పండగలు పబ్బాలు, జాతీయ పర్వదినాలు, ప్రత్యేక వేడుకలతో పాటు వర్షాల కారణంగా బాగానే సెలవులు వచ్చాయి. మరి వచ్చేఏడాది సెలవులు ఎలా ఉంటాయోనని ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి 2026 లో రాబోయే సెలవుల గురించి తెలుసుకుందాం.

211
2026లో నెలల వారిగా సెలవుల లిస్ట్

జనవరి 2026 సెలవులు :

జనవరి 1 - న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సరం సెలవుతోనే ప్రారంభం అవుతుంది. విద్యార్థులు, ఉద్యోగులకు ఈ రోజు సెలవు ఉంటుంది. అయితే కొన్ని ప్రైవేట్, ఐటీ కంపెనీ డిసెంబర్ 31న కూడా తమ ఉద్యోగులకు సెలవు ఇస్తుంటాయి. అంటే కొందరికి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తాయన్నమాట. 

జనవరి 13,14,15 - సంక్రాంతి పండగ

ఈ మూడురోజులు ఉద్యోగులకు సెలవులుంటాయి. విద్యార్థులకు అయితే దాదాపు 7 నుండి 10 రోజులు సంక్రాంతి సెలవులుంటాయి. దసరా తర్వాత అత్యధికంగా సెలవులు వచ్చేది ఈ సంక్రాంతి పండక్కే. ఈ పండగను తెలుగు ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏపీలో అయితే వేడుకలు మరోస్థాయిలో ఉంటాయి.

జనవరి 23 - వసంత పంచమి

జనవరిలో సంక్రాంతి తర్వాత వసంత పంచమికి సెలవు ఉంటుంది. ఈరోజుల ప్రజలు భక్తిశ్రద్దలతో సరస్వతి పూజ చేస్తుంటారు.

జనవరి 26 - గణతంత్ర దినోత్సవం

దేశవ్యాప్తంగా జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు జాతీయ సెలవు దినం.

311
ఫిబ్రవరి 2026 సెలవులు

ఫిబ్రవరిలో పెద్దగా పండగలేమీ ఉండవు. ఇది పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులకు అస్సలు సెలవులుండవు. కేవలం శివరాత్రి హాలిడే మాత్రమే ఉంటుంది.... కానీ ఈసారి ఈ పండగ కూడా ఆదివారం వస్తోంది. అంటే ఈ సెలవు కూడా మిస్ అయినట్లే.

411
మార్చి 2026 సెలవులు

మార్చి 4 - హోలి

హోలి పండక్కి ఉద్యోగులకే కాదు విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఈ రంగుల పండగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.

మార్చి 19 - ఉగాది

మార్చిలో వచ్చే అచ్చతెలుగు పండగ ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరాది... ఈరోజుల విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. తెలుగు ఇళ్లలో ఈ పండగను చాలా పవిత్రంగా జరుపుకుంటారు.

మార్చి 19 లేదా 20 - రంజాన్ పండగ

ముస్లింల పవిత్రమైన రంజాన్ పండగ మార్చిలో వస్తోంది. అయితే నెలవంక ఆధారంగా ఈ పండగా ఉంటుంది... ఖచ్చితంగా ఏరోజు రంజాన్ సెలవు ఉంటుందో చెప్పలేం... కానీ మార్చి 19 లేదా 20 తేదీల్లో ఏదో ఒకరోజు ఉండే అవకాశాలున్నాయి.

మార్చి 26 - శ్రీరామనవమి

భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. అందుకే శ్రీరామనవమికి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.... తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు సెలవే.

511
ఏప్రిల్ 2026 సెలవులు

ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14న సెలవు ఉంటుంది. విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈరోజు సెలవే.

611
మే, జూన్, జూలై వేసవి సెలవులు

మార్చి, ఏప్రిల్ లో దాదాపు అందరు విద్యార్థులకు పరీక్షలు ముగుస్తాయి. ఎండలు దంచికొట్టే మే, జూన్ లో విద్యార్థులకు సెలవులుంటాయి. జూలైలో కూడా పెద్దగా పండగలేమీ ఉండవు… కాబట్టి సెలవులు లేవు.  ఉద్యోగులకు కూడా ఈ మూడు నెలల్లో చాలా తక్కువ సెలవులు వస్తాయి.

జూన్ 2 - తెలంగాణ అవరణ దినోత్సవం

తెలంగాణ అవరతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉద్యోగులకు సెలవు ఉంటుంది. అయితే విద్యార్థులకు మాత్రం అప్పటికి ఇంకా వేసవి సెలవులు కొనసాగుతుంటాయి.

711
ఆగస్ట్ 2026 సెలవులు

ఆగస్ట్ 15 - స్వాతంత్య్ర దినోత్సవం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజు ఆగస్ట్ 15, 1947. అందుకే ప్రతిఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు జాతీయ సెలవుదినం.

ఆగస్ట్ 28 - రాఖీ పౌర్ణమి

ఆగస్ట్ లో వచ్చే మరో పండగ రాఖీ పౌర్ణమి. అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్ల అనుబంధాల పండగ రాఖీ… కాబట్టి ఈరోజు సెలవు ఉంటుంది.

ఆగస్ట్ - బోనాల పండగ

ఆగస్ట్ లో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ జరుగుతుంది. మరీముఖ్యంగా హైదరాబాద్ లో ఈ బోనాల వేడుకలు వైభవంగా జరుకుంటారు. ఈ పండగ సందర్భంగా అధికారిక సెలవు ఉంటుంది. అయితే 2026 లో ఆషాడ బోనాల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది.

811
సెప్టెంబర్ 2026 సెలవులు

సెప్టెంబర్ 4 - శ్రీకృష్ణ జన్మాష్టమి

హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అందుకే ఈరోజు సెలవు ఉంటుంది.

సెప్టెంబర్ 14 - వినాయక చవితి

బొజ్జ గణపయ్య విగ్రహాలను ఊరూవాడ, గల్లీగల్లిన ఏర్పాటుచేసి భక్తితో పూజించుకునే పండగ వినాయక చవితి. అందుకే విగ్రహాలను ప్రతిష్టించేరోజు సెలవు ఉంటుంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా సెలవు ఉంటుంది.

911
అక్టోబర్ 2026 సెలవులు

అక్టోబర్ 2 - గాంధీ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకునేరోజు అక్టోబర్ 2... గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది.

అక్టోబర్ 19 - దుర్గాష్టమి

అక్టోబర్ లొ దుర్గాష్టమి సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కేవలం ఆప్షనల్ హాలిడే మాత్రమే.

అక్టోబర్ 20 - దసరా

దసరా పండగ సందర్భంగా ఉద్యోగులకు ఈరోజు సెలవు ఉంటుంది. కానీ విద్యార్థులకు మాత్రం పండక్కిముందు, తర్వాత కూడా సెలవులు ఉంటాయి. మొత్తంగా 10 నుండి 15 రోజులు సెలవులు వస్తాయి.

1011
నవంబర్ 2026 సెలవులు

నవంబర్ 19 - దీపావళి

దీపావళి అనేది వెలుగుల పండగ. హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగ. అందుకే ఈరోజు సెలవు ఉంటుంది.

1111
డిసెంబర్ 2026 సెలవులు

డిసెంబర్ 25 - క్రిస్మస్

క్రిస్టియన్స్ ఎంతో వైభవంగా జరుపుకునే పండగా క్రిస్మస్. ఈ పండగ నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ఉంటుంది. విద్యాసంస్థలకు రెండ్రోజులు (డిసెంబర్ 26 బాక్సింగ్ డే) సందర్భంగా సెలవు ఉంటుంది. క్రిస్టియన్ మైనారిటి విద్యాసంస్థలకు వరుసగా నాలుగైదు రోజులు సెలవులు ఉంటాయి.

డిసెంబర్ 31 - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 

కొన్ని ప్రైవేట్ సంస్థలు న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో తమ ఉద్యోగులకు డిసెంబర్ 31న కూడా సెలవు ఇస్తాయి. క్రిస్టియన్ కంట్రీస్ కు సేవలందించే కొన్ని సంస్థల  ఉద్యోగులకు క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు వరుస సెలవులు ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories