Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

Published : Dec 03, 2023, 03:05 PM ISTUpdated : Jun 18, 2024, 11:22 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ పోటీ  చేయలేదు. అయితే  ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు  కాంగ్రెస్ కు అనుకూలంగా  పనిచేశారు.  కాంగ్రెస్ అభ్యర్థుల  గెలుపు కోసం పనిచేశారు.  గాంధీ భవన్ లో టీడీపీ శ్రేణులు పసుపు జెండాలు పట్టుకొని  డ్యాన్స్ చేశారు.

PREV
111
 Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్  సహకరించారని టీడీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే

 

also read:andole assembly results 2023:ఆందోల్ లో దామోదర రాజనర్సింహ గెలుపు

211
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులతో  ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2018 ఎన్నికల ముందు  టీడీపీని వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతికాలంలో  రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

 

also read:Paleru Election Result 2023:పాలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆధిక్యంలో పొంగులేటి

311
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరిన సమయంలో పలువురు టీడీపీకి చెందిన కీలక నేతలు రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ లో చేరిన  నేతలకు  రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ, 2018 ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అయితే ఈ దఫా  గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే  టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సునీల్ కనుగోలు  సర్వే రిపోర్టు ఆధారంగా టిక్కెట్లు కేటాయించారు.

 

also read:Nalgonda Election Results 2023: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు..కోమటిరెడ్డి గెలుపు

411
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

2018 ఎన్నికల సమయంలో  తెలంగాణలో  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే  2018 ఎన్నికల్లో తెలంగాణలో  వేలు పెట్టవద్దని  కేసీఆర్  చంద్రబాబును కోరారు. హరికృష్ణ మరణించిన సమయంలోనే  చంద్రబాబు నాయుడు తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి, టీడీపీ మధ్య పొత్తు కోసం చంద్రబాబు  చర్చించారని  అప్పట్లో బీఆర్ఎస్ నేతలు  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పొత్తు వద్దని తేల్చి చెప్పడంతో  కాంగ్రెస్ కూటమిలో  టీడీపీ చేరింది. 

 

also read:Khammam Election Result 2023: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో తుమ్మల

511
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్


2018 ఎన్నికల్లో  తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలుపెడుతున్నారని కేసీఆర్ సెంటిమెంట్ ను రగిల్చారు.దీంతో  ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్  కు  కలిసి వచ్చింది.  టీడీపీతో కలిసి పోటీ చేయడం  తమకు నష్టం చేసిందని అప్పట్లో  కాంగ్రెస్ నేతలు  కూడ అభిప్రాయపడ్డారు. 

 

also read:Achampet Election Result 2023: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు

611
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

2018 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్  వార్నింగ్ ఇచ్చిన  విషయం తెలిసిందే.  2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు హైద్రాబాద్ లోటస్ పాండ్ లో  వైఎస్ జగన్మోహన్ రెడ్డితో  కేటీఆర్ భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో  బీఆర్ఎస్ వైఎస్ఆర్‌సీపీ సహకరించిందనే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ నేతలున్నారు.

also read:Telangana Assembly Election Results 2023 LIVE : చేవేళ్ల ఫలితంపై ప్రతిష్టంభన...

711
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

తెలంగాణ ఎన్నికల్లో  ఈ దఫా పోటీ చేయాలని  తెలుగుదేశం భావించింది. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు  రాజమండ్రి జైల్లో ఉన్నారు. దీంతో తెలంగాణ ఎన్నికలపై కేంద్రీకరించలేమని  టీడీపీ నాయకత్వం భావించింది.  ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో  టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు

 

also read:Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

811
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

చంద్రబాబునాయుడు  రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో  హైద్రాబాద్ లో  ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసిన సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో  తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు  వారి వ్యక్తిగతమైనవిగా పేర్కొన్నారు.  ఆ తర్వాత  చంద్రబాబు అరెస్ట్ విషయమై  హరీష్ రావు స్పందించారు.

 

also read:Telangana Election results 2023:ఉత్తర,దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ అభ్యర్థుల హవా 

911
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

2014 ఎన్నికల సమయంలో  తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు చేశారు.  2018 ఎన్నికల సమయంలో సీమాంధ్ర ఓటర్లు  బీఆర్ఎస్ కు ఓటు వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో  బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు.  గత ఎన్నికల్లో మాదిరిగానే  హైద్రాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. 

1011
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  తెలుగుదేశం పార్టీ  క్యాడర్  బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  ఇదే పరిస్థితి నెలకొంది. ప్రియాంకగాంధీ  రోడ్ షో లో కూడ  టీడీపీ శ్రేణులు పసుపు జెండా పట్టుకొని పాల్గొన్నారు.

1111
Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి  టీడీపీ జెండాలు పట్టుకొని  ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చంద్రబాబు ఏజంట్ అంటూ  బీఆర్ఎస్ నేతలు  పలు సందర్భాల్లో విమర్శలు చేశారు.  అయితే ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయానికి పరోక్షంగా చంద్రబాబు కూడ దోహదం చేశారని  టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు  కేసీఆర్  చెక్ పెడితే  ఈ ఎన్నికల్లో  కేసీఆర్ కు  చంద్రబాబు పరోక్షంగా  కాంగ్రెస్ కు సహాయం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే  ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories