Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

First Published | Dec 3, 2023, 9:26 AM IST

తెలంగాణలో  ఈ దఫా  అధికారాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో  కాంగ్రెస్ ప్లాన్ ఫలించింది.  బీఆర్ఎస్ ను మట్టికరిపించి తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  అధికారాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో  కాంగ్రెస్ పార్టీ వేసిన అడుగులు ఫలితాన్ని ఇచ్చాయి.  తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరమైంది. దీంతో  ఈ దఫా  అధికారం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. 

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు  తెలంగాణలో  కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కర్ణాటకలో అనుసరించిన ఫార్మూలానే తెలంగాణలో కాంగ్రెస్ అవలంభించింది.

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.  తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  ఎన్నికల హామీలతో పాటు  కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత  కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ ఈ దఫా గెలవాలనే లక్ష్యంతో పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేశారు. పార్టీ గెలిచిన తర్వాతే  ఇతర విషయాలపై ఫోకస్ పెట్టాలనే అభిప్రాయంతో సీనియర్లు ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసే వ్యూహంతో వెళ్లారు కాంగ్రెస్ నేతలు.ఈ వ్యూహం కాంగ్రెస్ కు మరింత కలిసి వచ్చింది.ఈ వ్యూహంలో భాగంగానే  కామారెడ్డి నియోజకవర్గంలో  రేవంత్ రెడ్డి  పోటీ చేశారు. 

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

మరో వైపు ఎన్నికల సమయంలో బీజేపీ నుండి కీలక నేతలు  కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడ ఆపార్టీకి మరింత ఊపును తీసుకు వచ్చింది. కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడ  బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని  చేసిన ప్రచారం కూడ  కాంగ్రెస్ కు మరింత కలిసి వచ్చింది

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

ఇదిలా ఉంటే  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పించడం కూడ  బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో  బరిలోకి దింపిన అభ్యర్థుల్లో కూడ గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు  సర్వే రిపోర్టు కీలక పాత్ర పోషించింది. 

Telangana Election results 2023:తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు

మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదేళ్ల పాటు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.  ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.  దీన్ని రాజకీయంగా  కాంగ్రెస్  తనకు అనుకూలంగా  మార్చుకుంది.  మరోవైపు ఎన్నికలకు ముందు తెలంగాణలో  కాంగ్రెస్ నేతలు  నిర్వహించిన పాదయాత్ర, బస్సు యాత్రలు కూడ ఆ పార్టీకి కలిసి వచ్చాయి.

Latest Videos

click me!