నిసార్ అందించే డేటా కేవలం శాస్త్రవేత్తలకే కాదు, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వరదలు, భూకంపాలు, వాతావరణంలో మార్పులు, అడవి అగ్నిప్రమాదాలు వంటి విపత్తులను ముందుగానే అంచనా వేయవచ్చు. రైతులకు పంటల పెరుగుదల, నీటి వినియోగం వంటి వివరాలు అందుతాయి.
వాతావరణ మార్పులు, హిమపర్వతాల కరుగుదల, అడవుల ఆరోగ్యంపై విలువైన సమాచారం అందుతుంది. ఇది భారత్ అంతరిక్ష ప్రయాణంలో గొప్ప అడుగు మాత్రమే కాకుండా, ప్రపంచ రక్షణకు రెండు దేశాలు కలిసి చేస్తున్న అద్భుత కృషిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.