భార‌త్‌లో ఆఫీస్ తెరుస్తోన్న ChatGPT.. పెద్ద ప్లానే.

Published : Aug 22, 2025, 12:14 PM IST

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సేవ‌లు వేగంగా విస్త‌రిస్తున్నాయి. ఓపెన్ఏఐ కంపెనీకి చెందిన చాట్‌జీపీటీ భార‌త్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగానే తొలి కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. 

PREV
15
ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం

అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ (ChatGPT కంపెనీ) ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది. ఇది భారత్‌లోని వినియోగదారుల సంఖ్య రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో, దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

DID YOU KNOW ?
భారత్‌కి ప్రాధాన్యత ఎందుకు?
భారత్‌లో దాదాపు ఒక బిలియన్‌కి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ChatGPTని ఎక్కువగా ఉపయోగించే విద్యార్థులు ఇక్కడే ఉన్నారని కంపెనీ భావిస్తోంది
25
భారత్‌కి ప్రాధాన్యత ఎందుకు?

భారత్‌లో దాదాపు ఒక బిలియన్‌కి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ChatGPTని ఎక్కువగా ఉపయోగించే విద్యార్థులు ఇక్కడే ఉన్నారని కంపెనీ భావిస్తోంది. గత ఏడాదిలో వారానికి యాక్టివ్ యూజర్లు నాలుగు రెట్లు పెరిగారు. అందుకే ఇక్కడికి ప్రత్యేకమైన చౌకైన ప్లాన్ – ChatGPT Go పేరుతో (రూ. 399 నెలకు) విడుదల చేసింది.

35
స్థానిక బృందం, భాగస్వామ్యాలు

ఓపెన్‌ఏఐ ఇప్పటికే భారత్‌లో లీగల్ ఎంటిటీగా నమోదు అయింది. స్థానిక ప్రభుత్వాలు, బిజినెస్‌లు, విద్యాసంస్థలు, డెవలపర్లతో సంబంధాలు బలోపేతం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తోంది. ఏప్రిల్ 2024లో ట్రూకాలర్, మెటా మాజీ అధికారి ప్రగ్యా మిశ్రాను పబ్లిక్ పాలసీ హెడ్‌గా నియమించింది. ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ రిషి జైత్లీ సీనియర్ సలహాదారుగా చేరారు. ఇందువల్ల భారత్‌లోని వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

45
ప్ర‌ధాన స‌వాళ్లు కూడా ఉన్నాయి.

ఓపెన్‌ఏఐకి భారత్‌లో కొన్ని ప్రధాన సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి.. ఎక్కువ మంది ఫ్రీ యూజర్లను పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లకు మార్చడం కష్టమైన విషయం. కొన్ని వార్తా సంస్థలు, పబ్లిషర్లు ChatGPT తమ కంటెంట్ అనుమతి లేకుండా వాడుతోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి.

55
భారత్‌లో AI భవిష్యత్తు ఎలా ఉండ‌నుంది.?

భారత్ ప్రభుత్వం IndiaAI Mission ద్వారా దేశాన్ని గ్లోబల్ AI లీడర్‌గా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది. ఓపెన్‌ఏఐ కూడా ఈ దిశగా ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్‌, డెవ‌ల‌ప‌ర్ డే కార్యక్రమాలను భారత్‌లో నిర్వహించనుంది. ఈ విష‌య‌మై ఓపెన్‌ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ.. "భారత్‌లో మా తొలి కార్యాలయం ప్రారంభించడం, స్థానిక బృందం ఏర్పాటు చేయడం చాలా కీలకమైన అడుగు. ఇది దేశ వ్యాప్తంగా AIని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ‘AI for India, with India’ లక్ష్యాన్ని నెరవేర్చుతుంది". అని చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories