Asia Cup 2025 India: ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, ఈ టీమ్ లో రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఒక టీమ్ నుంచి అయితే ఒక్కరు కూడా లేరు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఆగస్టు 19న అజిత్ ఆగార్కర్ భారత జట్టును ప్రకటించారు. భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఓపెనర్ శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు.
ఈసారి జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి వచ్చారు. గతంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ బాధ్యతలను గిల్ కు అప్పగించారు. అయితే, ఆసియా కప్ భారత జట్టులో ఐపీఎల్ లోని రెండు జట్ల ప్లేయర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఏ ఐపీఎల్ జట్టు నుంచి ఎంత మంది ప్లేయర్లు టీమిండియాలో చోటుదక్కించుకున్నారనే వివరాలు గమనిస్తే టాప్ లో ముంబై ఉంది. ఇతర జట్ల వివరాలు గమనిస్తే..
DID YOU KNOW ?
ఆసియా కప్ 2025
ఆసియా కప్ ను ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్ లో నిర్వహించారు. రాబోయే ఐసీసీ ఈవెంట్ క్రమంలో ఆసియా కప్ ఫార్మాట్ ను నిర్ణయిస్తున్నారు. ఆసియా కప్ 2025 ఎడిషన్ టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు.
25
భారత జట్టులో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం
భారత జట్టులో ఐపీఎల్ జట్ల ప్రాతినిధ్యం స్పష్టంగా కనిపించింది. 10 జట్లలో 9 జట్ల ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అయితే, ముంబై ఇండియన్స్ నుంచి అత్యధికంగా నలుగురు ప్లేయర్లు ఎంపికవడం విశేషం. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ముంబై ఇండియన్స్ తర్వాత కోల్ కతా నైట్‌రైడర్స్‌కు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది.
35
ముంబై ఇండియన్స్ నుంచి ఎంపికైన ఆటగాళ్లు ఎవరు?
ముంబై ఇండియన్స్ జట్టులో నుంచి సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ప్లేయర్లు చాల కాలం నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా వన్డే, టీ20లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో నంబర్-1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ముంబై ఇండియన్స్ తర్వాత అధికంగా కోల్ కతా నైట్‌రైడర్స్ నుంచి భారత జట్టులో ఉన్నారు. వారిలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దూబే, రాయల్ ఛాాలెంజర్స్ బెంగళూరు నుంచి జితేష్ శర్మ ఎంపికయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ, పంజాబ్ కింగ్స్ నుంచి అర్షదీప్ సింగ్, గుజరాత్ టైటాన్స్ నుంచి శుభ్ మన్ గిల్, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ కూడా ఆసియా కప్ 2025 టీమిండియా స్క్వాడ్‌లో ఉన్నారు.
55
ఐపీఎల్ జట్ల వారీగా టీమిండియాలోని ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే