భారత మార్కెట్లో రూ.35,999 ధరతో లాంచ్ అయిన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,489కి లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.9,510 తగ్గింపు ఉంది.
అలాగే, ఎస్ బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్లపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తే మరింత సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, పాత మోటరోలా ఎడ్జ్ 40 నియో ఎక్స్చేంజ్ చేస్తే రూ.9,600 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,389కి చేరుతుంది.