ఆపిల్ మ్యాజికల్ ఫిగర్: పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించి మొదటి కంపెనీగా..

First Published | Jan 4, 2022, 10:50 AM IST

దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్  (apple)పెద్ద కంపెనీలను అధిగమించి చరిత్ర సృష్టించింది. సోమవారం కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది ఎన్నడూ లేని విధంగా అత్యధికం. ఆపిల్ కంపెనీ మార్కెట్ వాల్యు సోమవారం మధ్యాహ్నం మూడు శాతం పెరుగుదలతో 182.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

అక్టోబర్ నుండి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 700 బిలియన్ల డాలర్లు ఏగబాకింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఐఫోన్ తయారీ సంస్థ  స్టాక్ ధర నిరంతరం పెరుగుతోంది. వర్క్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటితో అనుసంధానించి ఉండటానికి టెక్నాలజి డిమాండ్ పెరగడంతో లాక్‌డౌన్ సమయంలో కంపెనీకి అత్యధిక లాభాలు వచ్చాయి.

కొన్ని  నివేదికల ప్రకారం కేవలం 16 నెలల్లోనే యాపిల్ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 1976లో ప్రారంభించిన యాపిల్ ఆగస్ట్ 2018లో 1 ట్రిలియన్ డాలర్ల మేజిక్ ఫిగర్‌ను తాకింది. ఈ ఘనత సాధించేందుకు 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత రెండేళ్లలోనే కంపెనీ మార్కెట్ విలువ రెండు లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది. అయితే కంపెనీ తదుపరి ట్రిలియన్ అంటే మూడు ట్రిలియన్ల మార్కెట్ విలువను చేరుకోవడానికి కేవలం 16 నెలల 15 రోజులు మాత్రమే పట్టింది.

Latest Videos


మరో టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ , ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్‌ను $3 ట్రిలియన్ల క్లబ్‌లోకి అనుసరించవచ్చు."మేము సంస్థ ప్రారంభించినప్పుడు ఎప్పటికీ కొనసాగే విజయవంతమైన సంస్థ అని అనుకున్నాము. కానీ దీన్ని నిజంగా ఊహించ లేదు," అని 1976లో స్టీవ్ జాబ్స్‌తో కలిసి ఆపిల్ ని స్థాపించిన ఇంజనీర్ అయిన స్టీవ్ వోజ్నియాక్ అన్నారు.  విశ్లేషకుడు హోవార్డ్ సిల్వర్‌బ్లాట్ ప్రకారం అన్ని గ్లోబల్ స్టాక్ మార్కెట్ల విలువలో యాపిల్ ఒక్కటే దాదాపు 3.3% అని చెప్పారు.

ఆపిల్ జనవరి 2007లో  మొదటి ఐఫోన్‌ను ఆవిష్కరించినప్పుడు కంపెనీ విలువ 73.4 బిలియన్ల డాలర్లు. పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల్లో ఒకటైన ఐఫోన్ ఆకట్టుకునే వృద్ధిని కొనసాగిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో ఐఫోన్ అమ్మకాలు 192 బిలియన్లు డాలర్లుగా ఉన్నాయి,  అంటే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40% పెరిగింది.

click me!