WPL 2026 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 277 మంది ఆటగాళ్లలో 73 మందికే ఛాన్స్ దక్కనుంది. వీరిలో కొంత మంది ప్లేయర్ల పై ఫ్రాంచైజీల డబ్బుల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎడిషన్ కు ముందు జరగనున్న మెగా వేలం క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐపీఎల్ తరహాలో పాపులర్ అవుతున్న ఈ లీగ్‌లో, జట్ల పునర్నిర్మాణానికి ఇది కీలక మలుపు కానుంది.
నవంబర్ 27న దేశరాజధాని న్యూఢిల్లీలో ఈ వేలం జరగనుంది. డబ్ల్యూపీఎల్ వేలం కోసం 277 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వారిలో 73 మందికే ఈసారి జట్లలో చోటుదక్కే అవకాశం ఉంది. గత మూడు సీజన్ల తర్వాత మళ్లీ వేలం జరుగుతోంది. మొత్తంగా ఇది రెండో మెగా వేలం కావడంతో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
25
వేలంలో భారత ప్లేయర్ల ఆధిపత్యం
ఈసారి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్న వారి జాబితాలో భారత ఆటగాళ్లే ఎక్కువ. మొత్తం 277 మందిలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. స్థానిక ప్రతిభపై ఫ్రాంచైజీల విశ్వాసాన్ని స్పష్టంగా చూపుతోంది. విదేశీ క్రీడాకారుల విషయానికొస్తే ఆస్ట్రేలియా (23), ఇంగ్లాండ్ (22), న్యూజిలాండ్ (13), దక్షిణాఫ్రికా (11) తదితర దేశాలు మంచి సంఖ్యలో ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. అసోసియేట్ నేషన్స్ నుంచి కూడా థాయిలాండ్, యుఎస్ఏ, యుఏఈ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వేలంలో 155 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండగా, వీరికి కనిష్ట బేస్ ధర ₹1 కోటిగా నిర్ణయించారు. 83 మంది విదేశీ ఆటగాళ్లలో నలుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.
35
అత్యధిక బేస్ ధర ₹5 కోట్లు.. వీరిపైనే అందరి చూపు
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో హైలైట్‌గా 20 మంది టాప్ టైర్ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా తమ బేస్ ప్రైస్‌ను ₹5 కోట్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో అత్యధిక ధరను పలికే ప్లేయర్లను గమనిస్తే.. దీప్తి శర్మ, అలీస్సా హీలీ, లారా వోల్వార్డ్, మెగ్ లాన్నింగ్, రేణుకా సింగ్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలియా కేర్, సోఫీ డివైన్ వంటివారు ఉన్నారు.
లారా వోల్వార్డ్ బేస్ ప్రైస్ ₹3 కోట్లు కాగా, రేణుకా సింగ్ ₹4 కోట్లతో వేలంలోకి వస్తున్నారు. మిగతా టాప్ ఆటగాళ్లందరికీ ₹5 కోట్ల బేస్ ప్రైస్ ఉండటం వేలానికి భారీ క్రేజ్‌ను తెచ్చింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026: ఫ్రాంచైజీల పర్స్ డీటెయిల్స్.. ఎవరివద్ద ఎంత డబ్బు ఉంది?
ప్రతి జట్టు గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లతో జట్టును నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం వివిధ జట్ల వద్ద ఉన్న పర్స్ వివరాలు గమనిస్తే.. అత్యధికంగా యూపీ వారియర్స్ వద్ద రూ.14.5 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ రూ.9 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 6.15 కోట్లు, ముంబై ఇండియన్స్ 5.75 కోట్లతో ఉన్నాయి.
యూపీ వారియర్స్ అత్యధిక పర్స్‌తో వేలం పోటీలోకి దిగుతోంది. గుజరాత్, ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ తమ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ బిడ్డింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.
55
స్టార్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఫోకస్
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ 2025లో మెరిసిన దీప్తి శర్మ ఈ వేలంలో హాట్ కేక్ గా భావిస్తున్నారు. తర్వాత అలీస్సా హీలీ, మేగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, అమేలియా కేర్ వంటి గ్లోబల్ స్టార్లు కూడా కోట్లలో బిడ్ దక్కించుకునే అవకాశం ఉంది.
డబ్ల్యూపీఎల్ 2026 కోసం జట్లు రీటైన్ చేసిన స్టార్ ప్లేయర్లు జాబితా
ముంబై ఇండియన్స్: నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్
ఆర్సీబీ: స్మృతి మంధాన, రీచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ
ఢిల్లీ క్యాపిటల్స్ : షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్