టీ20 వరల్డ్‌ కప్: కొలంబోలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

Published : Nov 21, 2025, 03:43 PM IST

India vs Pakistan: 2026 టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలలో జరగనుంది. ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ పై బిగ్ అప్డేట్ వచ్చింది.

PREV
15
2026 టీ20 వరల్డ్‌ కప్ ఉత్కంఠ

2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌కు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరుగుతుంది.

భారత్ తన తొలి మ్యాచ్‌ను అమెరికా (USA) జట్టుతో ఆడనుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ నేపథ్యాలతో భారత్, పాక్ మ్యాచ్ ఎల్లప్పుడూ ప్రత్యేకతంగా ఉంటుంది.

25
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ గ్రౌండ్ లు ఇవే

ఐసీసీ మొత్తం ఏడు గ్రౌండ్ లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో భారత్‌లో ఐదు.. నరేంద్ర మోదీ స్టేడియం, ఈడెన్ గార్డెన్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, చెన్నై, ముంబై ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో రెండు గ్రౌండ్ లలో మ్యాచ్ లు ఉన్నాయి.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. తాజాగా మ్యాచ్‌ల కేటాయింపులో కూడా ఈ ప్రధాన స్టేడియాలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ మ్యాచ్‌లు, సెమీఫైనల్స్ శ్రీలంకలో నిర్వహించాలన్న ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ ఫైనల్‌ చేరితే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరితే, వారి మ్యాచ్ స్వదేశంలోనే జరగనుంది.

35
ఇండియా–పాక్ పోరు: ఫిబ్రవరి 15 అదిరిపోతుంది !

ఐసీసీ తుది నిర్ణయం ప్రకారం, ఇండియా–పాక్ మ్యాచ్ కొలంబోలోనే ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. భారత్‌ గ్రూప్‌ దశలో తన తొలి మ్యాచ్ ను అమెరికాతో తలపడనుంది.

• గ్రూప్ మ్యాచ్ 2: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో – ఫిబ్రవరి 15, 2026

• సెమీఫైనల్: ముంబై (వాంఖడే) – మార్చి 5, 2026

• ఫైనల్*: అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం) – మార్చి 8, 2026 (భారత్ అర్హత సాధిస్తే)

45
ముంబై లో సెమీఫైనల్, అహ్మదాబాద్ లో ఫైనల్

క్రికెట్ వర్గాల ప్రకారం.. 2026 టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ గ్రౌండ్స్ సిద్ధమవుతున్నాయి. మార్చి 5న ముంబైలో సెమీఫైనల్, మార్చి 8న అహ్మదాబాద్‌లో ఫైనల్ నిర్వహించాలని ప్రణాళికలు ఉన్నాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. భారత్ ఫైనల్‌కి చేరితే, ఇక్కడి వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది.

ఇదే సమయంలో, పాకిస్తాన్ లేదా శ్రీలంక సెమీఫైనల్‌కి అర్హత సాధించినట్లయితే, కోలంబోలో తమ మ్యాచ్‌ ఆడతాయి. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న ICC–ACC నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో, బహుళ జాతీయ టోర్నమెంట్‌లలో తటస్థ గ్రౌండ్ లలో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

55
గ్లోబల్ క్రికెట్ విస్తరణ ప్రణాళికలు

భారత్ తొలి మ్యాచ్ యూఎస్ఏతో ఉండటం గ్లోబల్ క్రికెట్ విస్తరణలో ఒక సూచికగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఐసీసీ కొత్త దేశాలకు అవకాశాలు కల్పిస్తోంది.

బలమైన జట్లు, హోమ్ కండిషన్స్‌, అభిమానుల అంచనాలు.. ఇవన్నీ కలిపి భారత్‌కు భారీ ఒత్తిడిని తీసుకురానున్నాయనే చర్చ కూడా సాగుతోంది. 2007 తర్వాత మరొకసారి టీ20 వరల్డ్‌కప్ సాధించాలన్న లక్ష్యంతో జట్టు ముందుకు సాగనుంది.

టోర్నమెంట్ పూర్తిస్థాయి షెడ్యూల్ త్వరలో అధికారికంగా విడుదల కానుంది. క్రీడా ప్రపంచంలో అత్యంత పెద్ద రైవల్రీ భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ మళ్లీ అందరిలో ఉత్కంఠ రేపడానికి సిద్ధంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories