ఐపీఎల్ లో ఎవరి ఫ్యాన్ పవర్ ఎక్కువ? నంబర్ వన్ టీమ్ ఏది?

Published : Dec 01, 2025, 06:45 PM IST

 IPL Team Most Fans in 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 అభిమానుల లెక్కలు తెలాయి. టాప్ ప్లేస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఏ జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయి?  

PREV
13
అత్యధిక అభిమానులు ఉన్న IPL జట్టు ఏది?

భారత్ లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరో ఆటకు లేదంటే అతిశయోక్తి కాదు. ఆటగాళ్లు మైదానంలో చేసే ప్రతి పరుగుకు, ప్రతి వికెట్‌కు ప్రేక్షకులు ఇచ్చే స్పందన మ్యాచ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ అయిన ఐపీఎల్, జట్ల ఆకర్షణ, స్టార్ ఆటగాళ్లు, సామాజిక మాధ్యమాల్లో వారి యాక్టివ్ ఆధారంగా భారీ అభిమానులను కలిగి ఉంది.

2025 అప్‌డేట్ ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మొత్తం 44.6 మిలియన్ల సోషల్ మీడియా ఫాలోవర్లతో టాప్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (MI) 41.5 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇటీవల తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నప్పటికీ, 39.7 మిలియన్ల ఫాలోయింగ్‌తో మూడో స్థానంలోనే కొనసాగుతోంది.

23
సోషల్ మీడియా ఫాలోవర్స్ : ఐపీఎల్ జట్ల ర్యాంకులు

ఐపీఎల్ జట్ల సోషల్ మీడియా అభిమానుల సంఖ్య ఇలా ఉంది..

1. చెన్నై సూపర్ కింగ్స్ 44.6 మిలియన్

ఫేస్‌బుక్ : 14M

ఇన్‌స్టాగ్రామ్ : 19.8M

ఎక్స్ : 10.8M

2. ముంబై ఇండియన్స్  41.5 మిలియన్

ఫేస్‌బుక్ : 15M

ఇన్‌స్టాగ్రామ్ : 18.3M

ఎక్స్ : 8.2M

3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  39.7 మిలియన్

ఫేస్‌బుక్: 11M

ఇన్‌స్టాగ్రామ్ : 21.3M

ఎక్స్ : 7.4M

4. కోల్ కతా నైట్ రైడర్స్  30.1 మిలియన్

5. పంజాబ్ కింగ్స్ – 17 మిలియన్

6. ఢిల్లీ క్యాపిటల్స్  – 16.5 మిలియన్

7. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 15.3 మిలియన్

8. రాజస్థాన్ రాయల్స్ 14 మిలియన్

9. గుజరాత్ టైటాన్స్ 7.43 మిలియన్

10. లక్నో సూపర్ జెయింట్స్ 5.81 మిలియన్

33
జట్ల ఫ్యాన్‌బేస్: గత రికార్డులు, స్టార్ ప్లేయర్లు, సోషల్ మీడియా ప్రభావం

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఎందుకు జాబితాలో ముందున్నాయంటే.. ఆయా జట్ల విజయాలు, స్థిరమైన ప్రదర్శనలు, అలాగే ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్ల పాత్ర ప్రధాన కారణం. ఆర్సీబీ మాత్రం టైటిల్స్ తక్కువగా ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి గొప్ప క్రికెటర్లు ఆ జట్టుకు ఆడటంతో భారీ అభిమానులను సొంతం చేసుకుంది.

కేకేఆర్ మూడు టైటిల్స్ గెలుచుకొని మూడో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా ఐపీఎల్ లో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు మధ్యస్థానాల్లో ఉన్నప్పటికీ, స్థిరమైన అభిమానులతో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories