Vaibhav Suryavanshi: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇది అండర్-19 ఆసియా కప్‌నకు ముందు భారత జట్టుకు పెద్ద ఆందోళన కలిగించే అంశంగా మారింది.
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. దోహాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అతను భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అద్భుతమైన సెంచరీతో పాటు పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
25
భారత్‌లో అట్టర్ ప్లాప్..
ఇక భారత్‌కు వచ్చాక వైభవ్ వరుసగా అట్టర్ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. అతడికి పరుగులు రాబట్టడానికే కష్టంగా మారింది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో వైభవ్ విఫలమవుతూ వస్తున్నాడు. ఒక్క భారీ స్కోర్ కూడా చేయలకేపోయాడు.
35
వైభవ్ ఫెయిల్యూర్..
2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో నవంబర్ 30న జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ చేతిలో బీహార్ ఘోర ఓటమిని ఎదుర్కుంది. బీహార్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లోఅతడు ఇలా అవుట్ కావడం ఇది మూడోసారి.
అంతకుముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. చండీగఢ్‌పై కూడా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా చూసుకుంటే తన చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 20 పరుగులకు కూడా చేరుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇలా విఫలం కావడంతో.. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ జట్టు ఇప్పటికీ ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది.
55
భారత అండర్-19 జట్టులో టెన్షన్
వైభవ్ సూర్యవంశీ పేలవమైన ఫామ్.. భారత అండర్-19 జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. భారత అండర్-19 జట్టు డిసెంబర్ 12 నుంచి దుబాయ్‌లో జరిగే అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో కీలక సభ్యుడు. వైభవ్ సూర్యవంశీ త్వరగా ఫామ్‌లోకి రాకపోతే, ఈ టోర్నీలో కచ్చితంగా భారత జట్టుకు కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్‌లో వన్డే ఫార్మాట్‌గా జరగనుంది.