18 బంతుల్లో 12 సిక్సర్లతో పూనకాలు.. ఫైనల్‌లో శివతాండవం ఆడేసిన RCB చిన్నోడు.. ఎవరంటే.?

Published : Dec 01, 2025, 06:39 PM IST

RCB: అబుదాబీ T10 లీగ్ చివరి మ్యాచ్‌లో UAE బుల్స్ జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ టిమ్ డేవిడ్ కేవలం 30 బంతుల్లో 98 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 

PREV
15
డేవిడ్ ధనాధన్..

టిమ్ డేవిడ్ అంటేనే విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. అబుదాబీ T10 లీగ్‌లో ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ లీగ్ చివరి మ్యాచ్‌ అనగా ఫైనల్‌లో UAE బుల్స్ తరపున ఆడుతున్న టిమ్ డేవిడ్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 98 పరుగులు చేశాడు.

25
ఫైనల్స్‌లో బుల్స్ హవా..

టిమ్ డేవిడ్ ఈ తుపాను బ్యాటింగ్‌తో UAE బుల్స్ జట్టు 10 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ఆ టార్గెట్ చేధించే క్రమంలో ఆస్పిన్ స్టాలియన్స్ జట్టు కేవలం 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో UAE బుల్స్ టి10 లీగ్ సీజన్‌ ట్రోఫీని గెలుపొందింది. థ్యాంక్స్ టూ టిమ్ డేవిడ్

35
టిమ్ డేవిడ్ విధ్వంసం..

యూఏఈ బుల్స్ జట్టుకు దారుణమైన ఆరంభం లభించింది. జేమ్స్ విన్స్ కేవలం రెండు బంతులకే రిటైర్ హార్ట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ వేగంగా ఆడినప్పటికీ.. ఎనిమిది బంతుల్లోనే 18 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చి విధ్వంసం సృష్టించాడు. మొదటి 13 బంతులు నార్మల్‌గా ఆడిన డేవిడ్.. ఆ తర్వాత గేర్ మార్చాడు. జోహార్ ఇక్బాల్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. తొమ్మిదో ఓవర్లో డేవిడ్ మరో మూడు సిక్సర్లు కొట్టాడు.

45
చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు..

చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ తన మ్యాజిక్ చూపించాడు. అష్మీద్ నెడ్ వేసిన ఓవర్లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉన్నాయి. బౌలర్ వేసిన మొదటి బంతికి ఒక సిక్సర్, రెండవ బంతికి రెండు పరుగులు, ఆ తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదాడు. డేవిడ్ తన చివరి 18 బంతుల్లో 12 సిక్సర్లు కొట్టాడు.

55
చేతులెత్తేసిన ప్రత్యర్ధులు..

టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ దగ్గరకు కూడా రాలేకపోయారు ఆస్పిన్ స్టాలియన్స్ జట్టు. స్టాలియన్స్ 10 ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. సునీల్ నరైన్ రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫజల్హాక్ ఫరూఖీ ఒక ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. స్టాలియన్స్ బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగుల వ్యక్తిగత స్కోరును అందుకోలేకపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories