అంగరంగ వైభవంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు... త్రివర్ణ పతకాన్ని చేతబట్టి...

First Published | Aug 8, 2021, 6:32 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జపాన్ టెక్నాలజీకి అద్దం పట్టేలా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరిగాయి... 

టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో హాకీ మెన్స్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, వుమెన్ బాక్సర్ మేరీకోమ్‌ జాతీయ పతకాన్ని చేతబూని నడవగా, ముగింపు వేడుకల్లో ఆ గౌరవం రెజ్లర్ భజరంగ్ పూనియాకి దక్కింది...

1980 మాస్కో ఒలింపిక్స్‌లో 23వ ర్యాంకులో నిలిచిన భారత్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48వ ర్యాంకులో నిలిచింది. 1980 తర్వాత భారత్‌కి ఇదే అత్యుత్తమ ర్యాంకు... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 50వ స్థానంలో నిలిచింది భారత్...

Latest Videos

2020 టోక్యో ఒలింపిక్స్‌ ర్యాంకింగ్స్‌లో అమెరికా టాప్‌లో నిలిచింది... రెండో స్థానంలో నిలిచిన చైనా కంటే, అమెరికా ఓ స్వర్ణం ఎక్కువగా సాధించింది. అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో 113 మెడల్స్ సాధించగా... చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో 88 మెడల్స్ సాధించింది...

2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఆరో స్థానంలో నిలిచిన భారత్, ఈసారి ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఏడు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది...

టోక్యో ఒలింపిక్స్ ముగియడంతో ఒలింపిక్ జెండాని పారిస్ మేయర్ అన్నే హిగాల్డోకి అందచేశారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఛీఫ్ థామస్ బాచ్... 2024లో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే...

Tokyo 2020 Closing ceremony: టోక్యో ఒలింపిక్స్‌ 2020 ముగింపు వేడుకల దృశ్యాలు...  

click me!