T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ మెగా టోర్నీలో భారత్‌కు సవాల్ విసరబోయే ఆటగాళ్లు ఎవరు? అభిషేక్ శర్మ, బుమ్రా ఎలాంటి ప్రభావం చూపగలరు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 ఫార్మాట్ అంటే అభిషేక్ శర్మనే.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం ఇతని ఆట స్టైల్. పవర్‌ప్లేను అద్భుతంగా ఉపయోగించుకుని షేక్ చేస్తాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అభిషేక్ శర్మ 194.74 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 1,297 పరుగులు సాధించాడు. అతని దూకుడు భారత జట్టుకు భారీ స్కోర్లు అందించడంలో కీలకం కానుంది. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఈ యంగ్ ఓపెనర్‌కు ఉంది.
25
జస్ప్రీత్ బుమ్రా: భారత్ ట్రంప్ కార్డ్
ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ ఎవరంటే అది జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. భారత జట్టు విజయాల్లో బుమ్రా పాత్ర ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు 87 టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 107 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 6.54 ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో అతను దిట్ట. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం, డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడం బుమ్రా ప్రత్యేకత. 2026 ప్రపంచకప్‌లో భారత్ ఆశలన్నీ బుమ్రాపైనే ఉన్నాయి.
35
వనిందు హసరంగా: లంక గడ్డపై డెంజరస్ ప్లేయర్
2026 టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సొంత గడ్డపై జరిగే ఈ టోర్నీలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా అత్యంత కీలకం కానున్నాడు. 94 టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 151 వికెట్లు తీసిన రికార్డు ఇతని సొంతం. లంకలోని స్పిన్ అనుకూల పిచ్‌లపై హసరంగా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడు. భారత్ ఈ ఆటగాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పెద్ద మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా నాకౌట్ పోరులో అద్భుతంగా ఆడటం ట్రావిస్ హెడ్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా జట్టుకు మెరుపు ఆరంభాలను ఇవ్వడంలో ఇతను ఎప్పుడూ ముందుంటాడు. 49 టీ20 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్ రేట్‌తో 1,224 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇతనికి భారత పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్పింది. ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ రేసులో ఉండాలంటే హెడ్ ఇచ్చే ఆరంభం చాలా ముఖ్యం. టీమ్ ఇండియా బౌలర్లకు ఇతను ప్రధాన సవాల్‌గా మారే అవకాశం ఉంది.
55
రషీద్ ఖాన్: ఆఫ్ఘన్ ఎక్స్ ఫ్యాక్టర్
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌కు పేరుంది. 111 మ్యాచ్‌ల్లో 187 వికెట్లతో అతను టీ20 వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం బౌలింగ్‌తోనే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్ చేయగలడు. అలాగే మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రపంచకప్‌లో ముందడుగు వేయించగల సత్తా ఉన్న ఏకైక ఆటగాడు రషీద్ ఖాన్. ఏ జట్టుకైనా ఇతని 4 ఓవర్లు దాటడం ఒక పెద్ద పరీక్ష లాంటిదే.