ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఈ క్రికెట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీ ఆదివారంతో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రియులకు కావాల్సిన అసలైన వినోదం అందనుంది.
ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, నేపాల్, ఇటలీ, ఆఫ్ఘనిస్థాన్, కెనడా, యూఏఈ, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి.