కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో రానుండగా, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి హిట్టర్లు బ్యాటింగ్ బలాన్ని పెంచనున్నారు. వాంఖడే పిచ్ పేసర్లకు సహకరిస్తుంది కాబట్టి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లతో పాటు హార్దిక్, దూబే పేస్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్నర్ల విషయానికి వస్తే, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది, దీనివల్ల కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవచ్చు.
అమెరికాతో తలపడే భారత జట్టు అంచనా
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.