Vaibhav Suryavanshi : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపే బ్యాటింగ్ తో సంచలనం రేపాడు. ఇప్పటికే 466 పరుగులు చేశాడు. ఇందులో 44 సిక్సర్లు బాదాడు. ఒక రికార్డు సెంచరీ కొట్టాడు. ఇప్పుడు సెమీఫైనల్లో మరో సునామీ రేపుతానంటున్నాడు.
వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత.. భారత యంగ్ స్టార్ తుఫాను
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదిక పై వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్ స్టార్ గా ముందుకు సాగుతున్నాడు.
ఈ టోర్నమెంట్ లో వైభవ్ ఇప్పటివరకు ఆడిన 11 టీ20ల్లోనే 466 పరుగులు సాధించాడు. కేవలం 211 బంతుల్లోనే 220.85 స్ట్రైక్ రేట్ తన ఆటను కొనసాగించాడు. ఏకంగా 44 సిక్సర్లు బాదాడు. అతని బ్యాటింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లకు దిమ్మదిరిగిపోతోంది.
25
తొలి మ్యాచ్ నుంచే దూకుడు.. కేవలం 32 బంతుల్లో సెంచరీ
ఈ టోర్నమెంట్‌లో వైభవ్ తన పవర్ హిట్టింగ్ ను తొలి మ్యాచ్ నుంచే మొదలుపెట్టాడు. యూఏఈపై సునామీ నాక్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే క్రీజులోకి వచ్చిన అతను ప్రత్యర్థి బౌలర్లను ఊపిరాడనివ్వకుండా దాడి చేశాడు. కేవలం 32 బంతుల్లో సెంచరీ కొట్టాడు. మొత్తం 144 పరుగులు తన ఇన్నింగ్స్ ను 342 స్ట్రైక్ రేట్ తో కొనసాగించాడు. తన నాక్ లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు.
ఈ ఇన్నింగ్స్ టోర్నమెంట్‌కు కొత్త టోన్ సెట్ చేసిన వైభవ్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్ స్టైల్, ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
35
పాకిస్తాన్, ఒమన్ మ్యాచ్‌ల్లో నిరాపర్చాడు.. కానీ
యూఏఈపై తుపాను సృష్టించిన తర్వాత పాకిస్తాన్‌పై 45 పరుగులు, ఒమన్‌పై కేవలం 12 పరుగులు మాత్రమే రావడంతో వైభవ్ కొంత ఒత్తిడిని అనుభవించాడు. కానీ, నాకౌట్ మ్యాచ్‌లలో మరోసారి సునామీ రేపుతానంటున్నాడు. బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తానంటున్నాడు. శుక్రవారం ఇండియా-ఏ vs బంగ్లాదేశ్-ఏ సెమీఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
గ్రూప్ దశలో మొత్తం 89 మంది బ్యాటర్లు ఆడగా, మూడు ప్రధాన విభాగాల్లో వైభవ్ టాప్ స్థానంలో నిలిచాడు. వాటిలో అత్యధిక స్ట్రైక్ రేట్ – 242.16తో ఈ టోర్నమెంట్‌లో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 144 నమోదుచేశాడు. అలాగే, మూడు మ్యాచ్‌ల్లో అత్యధికంగా 18 సిక్సర్లు బాదాడు.
55
టీ20లో అతి చిన్న వయసులో రెండు సెంచరీలతో వైభవ్ వరల్డ్ రికార్డు
టీ20 క్రికెట్ లో అతిచిన్న వయస్సులోనే సెంచరీలు బాదిన రికార్డు ఫ్రాన్స్ ఆటగాడు గుస్తావ్ మెక్‌కాన్ పేరుపై ఉంది. వైభవ్ కేవలం 14 ఏళ్లు 232 రోజుల్లో టీ20ల్లో రెండు శతకాలు కొట్టి చరిత్ర సృష్టించాడు.
బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ తన ఆటపై మాట్లాడుతూ.. “200 పరుగులు చేసినా నాన్న సంతోషపడరు… ఇంకో 10 చేయాల్సింది అంటారు. “అమ్మ మాత్రం వేరేలా ఉంటుంది. సెంచరీ చేసినా, డకౌట్ అయినా, ఆమె చిరునవ్వు ఒకటే. షాట్లు ప్రయోగించను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాటినే ఆడతాను” అని చెప్పాడు.