Shreyas Iyer Injury Update: ఇంటర్నల్ బ్లీడింగ్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వరకు కఠిన పర్యవేక్షణ ఉంటుందనీ, అయ్యర్ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపడానికి బీసీసీఐ చర్యలు తీసుకుంది.
టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్టోబర్ 25న జరిగిన మూడో వన్డే సమయంలో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ ను అందుకునే సమయంలో పక్కటెములకు గాయం కావడంతో తీవ్ర నొప్పితో గ్రౌండ్‌లోనే అల్లాడిపోయాడు. మొదట ఫీల్డులోనే చికిత్స ఇచ్చారు.
తరువాత పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో అయ్యర్ ప్లీహానికి గాయం అయినట్టు నిర్ధారించారు. ఆ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభమై ప్రమాద స్థాయి పెరిగింది. డాక్టర్లు వెంటనే అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స మొదలుపెట్టారు.
26
శ్రేయాస్ అయ్యర్ గాయం పై బీసీసీఐ అధికారిక అప్‌డేట్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శి దేవజీత్ సైకియా శ్రేయాస్ అయ్యర్ గాయం పై అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “మూడో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ పక్కటెములకు గాయం అయింది. స్ప్లీన్‌కు గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏర్పడింది. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. సిడ్నీతో పాటు భారత్‌లోని నిపుణుల సలహాలతో పర్యవేక్షణ కొనసాగుతోంది” అని తెలిపారు. అయన త్వరితగతిన కోలుకుంటున్నారని అన్నారు. టీమ్ డాక్టర్లు ఆయన్ను నిత్యం పరిశీలిస్తూ నివేదికలు పంపిస్తున్నారు.
36
ఐసీయూలో గట్టి పర్యవేక్షణ
పీటీఐ సమాచారం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్‌కు గత రెండు రోజులుగా ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. 2-7 రోజులు డాక్టర్లు కఠిన పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం. నివేదికలు వెలువడిన వెంటనే ఆసుపత్రిలో భద్రతా చర్యలు చేపట్టారు.
స్ప్లీన్ గాయం ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావించారు. అదృష్టవశాత్తు సమయానికి చికిత్స లభించడంతో పరిస్థితి ప్రస్తుతానికి స్థిరంగా ఉంది.
శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన తండ్రి సంతోష్ అయ్యర్, తల్లి రోహిణి అయ్యర్‌ను త్వరగా ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ సమాచారం. వారి రాక సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒకరిని వెంటనే ఆయన దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
56
శ్రేయాస్ అయ్యర్‌కు గాయం ఎలా అయింది?
మూడో వన్డేలో 34వ ఓవర్‌లో ఎలెక్స్ క్యారీ క్యాచ్ కోసం శ్రేయాస్ అయ్యర్ వేగంగా పరుగు తీశారు. గాల్లోకి దూకుతూ పట్టిన ఆ క్యాచ్ టీం ఇండియాకు వికెట్ అందించింది. అయితే అదే సమయంలో ఆయన నేలపై పడటంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లలాడారు. వెంటనే గ్రౌండ్‌ను వీడి చికిత్సకు వెళ్ళాల్సి వచ్చింది.
ఆ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌లు కోల్పోయిన భారత్ ఈ విజయంతో గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది. టి20 జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడం వల్ల జట్టు కూర్పుపై తక్షణ ప్రభావం ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
66
గతంలోనూ శ్రేయాస్ అయ్యర్‌కు గాయాలు
శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా భుజం, లోయర్ బ్యాక్ గాయాలతో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నారు. ఈసారి స్ప్లీన్ గాయం చికిత్స పూర్తయ్యే వరకు సిడ్నీలో మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీసీసీఐ, వైద్య బృందం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.