Shreyas Iyer : ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియన్ వన్డే టీం వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతున్నారంటే గాయం ఏస్థాయిలో అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
Shreyas Iyer Injury : టీమిండియా యువ క్రికెటర్ శ్రేయార్ అయ్యర్ ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఇది సాధారణ గాయం కాదు... అతడు ఐసియూలో చేరి చికిత్స పొందేస్థాయిలో జరిగిందని... ప్రాణాంతకంగా మారినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రేయాస్ సిడ్నీలోని ఓ హాస్పిటల్లో చేరారు… ఐసియూలో (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఉంచిమరీ వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
25
శ్రేయాస్ శరీరంలో అంతర్గత రక్తస్రావం
న్యూస్ ఏజెన్సీ పిటిఐ (PTI) సమాచారం మేరకు... ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న శ్రేయాస్ చివరి వన్డేలో గాయపడ్డాడు. ఈ గాయం చాలా తీవ్రంగా ఉందని... అతడి శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరిగినట్లు తెలిపింది. గాయంతో మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన అతడు తీవ్ర నొప్పితో బాధపడగా బిసిసిఐ వైద్యసిబ్బంది వెంటనే సిడ్నీలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శ్రేయాస్ అయ్యర్ ను ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
35
శ్రేయాస్ అయ్యర్ కు తప్పిన ప్రమాదం
సమయానికి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందట... లేదంటే శ్రేయాస్ గాయం తీవ్ర పరిణామాలకు దారితీసేదని సిడ్నీ డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తుండటంతో శ్రేయాస్ ఇప్పడిప్పుడే కోలుకుంటున్నాడు... కాబట్టి ఇప్పుడే ప్రయాణం వద్దని డాక్టర్లు సూచించారట. దీంతో మరో వారంరోజులపాటు శ్రేయాస్ ఆస్ట్రేలియాలోనే ఉండనున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వరుసగా రెండువన్డేలు ఓడిపోవడంతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేను చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ మ్యాచ్ లో ఏ తప్పు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలనే పట్టుదలతో ఆడింది... ఈ క్రమంలోనే శ్రేయాస్ గాయపడ్డారు. హర్షిత్ రాణా బౌలింగ్ లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు వెనక్కి పరుగెత్తి డైవ్ చేసిన అయ్యర్ గాయపడ్డాడు. తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయిన అతడు వెంటనే మైదానాన్ని వీడాడు.
55
శ్రేయాస్ అయ్యర్ కు ప్రాణాంతక గాయం
మొదట అందరూ ఇది చిన్నగాయమే అనుకున్నారు... కానీ డ్రెస్సింగ్ రూంకి చేరుకున్నాక నొప్పి మరింత తీవ్రమయ్యింది. దీంతో వెంటనే బిసిసిఐ సహాయక సిబ్బంది అయ్యర్ ను హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలోనే ఎడమ పక్కటెముక వద్ద గాయమై అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు... హాస్పిటల్ కు తరలించకుండా అజాగ్రత్త వహించివుంటే ప్రాణాంతకంగా మారేదని సిడ్నీ వైద్యులు చెబుతున్నారు.