Rohit and Virat : ఆస్ట్రేలియాలో చివరి వన్డేలో రోహిత్ శర్మ 121* పరుగులు, విరాట్ కోహ్లీ 74* పరుగుల సూపర్ నాక్ ఆడటంతో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. సైలెంట్ గా ఉంటూనే కోహ్లీ, రోహిత్ లు తమపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చారు.
ఆస్ట్రేలియా vs భారత్ మూడో వన్డేలో సిడ్నీలో టీమిండియా 9 వికెట్లతో విక్టరీ కొట్టింది. సిరీస్‌ను 2-1 తేడాతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత మూడో వన్డేలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో విజయాన్ని సాధించారు. మొత్తం 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలోనే చేధించింది. టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దుమ్మురేపారు.
25
సిడ్నీలో అదరగొట్టిన రోహిత్, విరాట్
రోహిత్ శర్మ తన 33వ వన్డే సెంచరీని నమోదు చేసి 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 74 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. తమపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం ఇచ్చారు. అంతకుముందు, ఈ ఇద్దరు స్టార్ల పై విమర్శలు చేసిన వారిని ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకుంటున్నారు. ఎవర్రా మీరంతా అంటూ విమర్శకులపై కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
కాగా, సిడ్నీ స్టేడియంలో “Thank You Rohit”, “Thank You Virat”, “Don’t Go Ro-Ko” పోస్టర్లు నిండిపోయాయి. ఈ జంట ఆస్ట్రేలియాలో చివరి మ్యాచ్ కావొచ్చు అన్న అనుమానాల నేపథ్యంలో అభిమానుల స్పందనలు ప్రత్యేకంగా నిలిచాయి.
మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. “మళ్లీ వస్తామో లేదో తెలీదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతి క్షణం మాకు ఎంతో ఆనంద క్షణాలను అందించాయి” అని పేర్కొన్నాడు. కోహ్లీ కూడా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. “ఇక్కడ ఆడడం అంటే మాకు ప్రత్యేకం. ఇక్కడ మాకు మీరు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు.
35
8 నెలల తర్వాత సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ
పెర్త్, అడిలైడ్‌లో కొంచెం బలహీనంగా కనిపించిన రోహిత్ శర్మ సిడ్నీలో పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. 8 నెలల తర్వాత సెంచరీ కొట్టాడు. తన సెంచరీ నాక్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. తన ఫిట్‌నెస్‌తో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్‌లో కోహ్లీతో పోటీ పడుతూ పరుగెత్తాడు. 11 కేజీలు తగ్గిన తర్వాత అతని శైలిలో గణనీయమైన మార్పులు కనిపించాయి. అతని పుల్ షాట్, స్వీప్ షాట్లు ప్రేక్షకులను అలరించాయి.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో డక్ అయిన విరాట్ సిడ్నీలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత్ విజయాన్ని అందించడానికి అజేయ నాక్ ఆడాడు. తన హాఫ్ సెంచరీ నాక్ లో 7 బౌండరీలు బాదాడు. బిగ్ స్క్వేర్ బౌండరీలను ఉపయోగించుకుని పరుగులు రాబట్టాడు. “డక్స్ తీరాయి. క్రికెట్ ఎప్పటికీ నేర్పుతూనే ఉంటుంది” అని కోహ్లీ నవ్వుతూ మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నాడు. మ్యాచ్ ముగిసే వరకు ఇద్దరూ నాటౌట్‌గా నిలిచి, ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు.
55
2027 వరల్డ్ కప్ ప్రశ్నకు సమాధానం ఇంకా మిస్టరీనే
మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్ వరుస పెట్టి 2027 వరల్డ్ కప్ గురించి ప్రశ్నలు ఆడిగారు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇద్దరూ వయసులు అప్పటికి వరుసగా 40, 39 ఏళ్లు అవుతాయి. దీంతో అప్పటివరకు వీరు తమ ఫిట్ నెస్, ఫామ్ ను కాపాడుకోవడం కష్టమే అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే భారత్ వన్డే షెడ్యూల్ లో పెద్దగా మ్యాచ్ లు లేవు. భారత్ తర్వాతి వన్డే సిరీస్‌ను వచ్చే నెల దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అందులో మాత్రం ఈ ఇద్దరూ అందుబాటులో ఉంటారని అంచనాలు ఉన్నాయి.