భారత్ vs దక్షిణాఫ్రికా: మొదటి టెస్టు ప్లేయింగ్ 11 ఇదే.. ఆ స్థానంలో ఆడేది ఎవరు?

Published : Nov 12, 2025, 10:31 PM IST

India South Africa Test: దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్ సిద్ధమైంది. అయితే, ప్లేయింగ్ 11 లో ఎవరెవరుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తనకు ఇష్టమైన టీమిండియా 11ను వెల్లడించాడు.

PREV
16
భారత్ vs దక్షిణాఫ్రికా: పార్థివ్ పటేల్ ప్రకటించిన జట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో నవంబర్ 14న కోల్‌కతాలో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తనకు ఇష్టమైన ఇండియన్ ప్లేయింగ్ 11ను వెల్లడించాడు. పార్థివ్ మాట్లాడుతూ.. జట్టులో పదిమంది ఆటగాళ్లు తన ఆటతో స్థానాలను నిలబెట్టుకున్నారని, కానీ నంబర్ 6 స్థానంలో మాత్రమే నిర్ణయం కష్టంగా ఉందని తెలిపారు.

భారత్ ఇటీవల ప్రకటించిన 15 మంది జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. స్టార్ స్పోర్ట్స్‌లో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ “ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉండేలా జట్టు ఉండాలి” అని సూచించారు.

26
భారత్ vs దక్షిణాఫ్రికా: నంబర్ 6 స్థానంపై సందిగ్ధం

“యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలి. నంబర్ 3లో సాయి సుదర్శన్, నంబర్ 4లో శుభ్‌మన్ గిల్, నంబర్ 5లో రిషబ్ పంత్ ఉండాలి. అయితే, నంబర్ 6 స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నది పెద్ద ప్రశ్న” అని పార్థివ్ పటేల్ అన్నారు.

“మిగతా జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఉంటారు” అని ఆయన వెల్లడించారు.

36
భారత్ vs దక్షిణాఫ్రికా: కోల్‌కతా వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది?

కోల్‌కతాలో ఉదయం త్వరగానే ఆట ప్రారంభం అవుతుందని పార్థివ్ పటేల్ పేర్కొన్నారు. “ఇక్కడ వాతావరణం, పిచ్ పరిస్థితులు జట్టు ఎంపికపై ప్రభావం చూపవచ్చు. నంబర్ 6లో నితీష్ రెడ్డి ఆడతారా? అతన్ని మూడో సీమర్‌గా ఉపయోగించవచ్చా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అదే జరిగితే ఇద్దరు పేసర్లు, మూడు స్పిన్నర్ల కాంబినేషన్ రెండో ఇన్నింగ్స్‌లో బాగా పనిచేస్తుంది” అని ఆయన వివరించారు.

46
భారత్ vs దక్షిణాఫ్రికా: జురెల్ స్థానం పై చర్చ

పార్థివ్ పటేల్ ప్రకారం, ధృవ్ జురెల్ గత కొన్ని సిరీస్‌ల్లో అద్భుతంగా రన్స్ సాధిస్తున్నప్పటికీ, జట్టు బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆల్‌రౌండర్ ఎంపికకు అవకాశం ఉండొచ్చన్నారు. “వెస్ట్ ఇండీస్ సిరీస్‌లోనూ, ఇతర మ్యాచ్‌లలోనూ జురెల్ నిరంతరంగా రన్స్ సాధించాడు. కానీ, జట్టు కాంబినేషన్‌ ముఖ్యమైతే, ఆల్‌రౌండర్ ఎంపికే జరగవచ్చు” అని పార్థివ్ అన్నారు.

అయితే, ఒక స్పెషలిస్టు బ్యాటర్ అవసరం ఉన్నప్పుడు ధృవ్ జురెల్ సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డారు. “ఒక బాట్స్‌మన్‌గా ఆడించాలంటే ధృవ్ జురెల్‌ను ఎంపిక చేయవచ్చు. ఈ జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే అతనిపై విశ్వాసం చూపింది. పెర్త్ టెస్టులో ఆడించాడు. ఆ టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది కానీ అతనికి మళ్లీ అవకాశం రాలేదు” అని ఆయన గుర్తు చేశారు.

56
భారత్ vs దక్షిణాఫ్రికా: జురెల్ తాజా ఫామ్ ఎలా ఉంది?

ఇటీవలి భారత్ A – దక్షిణాఫ్రికా A రెండో అనధికార టెస్టులో ధృవ్ జురెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 175 బంతుల్లో 132 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 170 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించడం ద్వారా తన ఫామ్‌ను నిరూపించాడు.

ఈ ప్రదర్శన అతన్ని ప్రధాన జట్టులో స్థానం సంపాదించడానికి మరింత దగ్గర చేసింది. పార్థివ్ పటేల్ కూడా ఈ ప్రదర్శనను ప్రస్తావిస్తూ, “జురెల్ తన ప్రదర్శనతో చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఎంపికదారులు ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అని చెప్పారు.

66
భారత్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ వివరాలు

భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సిరీస్‌కు ముందు పార్థివ్ పటేల్ జట్టు ప్రకటన ఆసక్తిని రేకెత్తించింది. నంబర్ 6 స్థానంలో ఎవరు ఉంటారు అన్నది అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. నితీష్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా ఆడుతాడా, లేక ధృవ్ జురెల్ బ్యాటర్‌గా అవకాశం దక్కించుకుంటాడా అన్నది నవంబర్ 14న ప్రారంభమయ్యే టెస్టులో తేలనుంది. అయితే, ఇప్పటికే పలు రిపోర్టుల ప్రకారం.. నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి అవుట్ చేశారని పేర్కొంటున్నాయి. ప్లేయింగ్ 11 లో జురెల్ ఉంటారని వెల్లడిస్తున్నాయి.

  • మ్యాచ్: భారత్ vs దక్షిణాఫ్రికా తొలి టెస్ట్
  • వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
  • తేదీ: నవంబర్ 14, 2025
Read more Photos on
click me!

Recommended Stories