ఆ ఊహ ఎంత బాగుందో.! SRHలోకి రోహిత్ శర్మ.. ఇక ఐపీఎల్ దద్దరిల్లిపోవాల్సిందే

Published : Nov 12, 2025, 06:39 PM IST

SRH: ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్స్ తెగ వైరల్ అవుతున్నాయ్. చెన్నైకి శాంసన్ ట్రేడ్ ఓ పెద్ద సర్‌ప్రైజ్ అయితే.. ఇప్పుడు మరో ట్రేడ్ జరగబోతోందని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలిస్తే మీరూ షాక్ అవ్వడం ఖాయం. మరి అదేంటంటే.? 

PREV
15
నెట్టింట భారీ ట్రేడ్స్ చర్చ

ఐపీఎల్ 2026 సీజన్ రాకముందే ఫ్రాంచైజీలలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో క్రికెట్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సంజూ శాంసన్, రోహిత్ శర్మ లాంటి కీలక ప్లేయర్స్ తమ ప్రస్తుత జట్లను వీడి కొత్త ఫ్రాంచైజీలలో చేరనున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

25
చెన్నై ట్రేడ్ కీలకం

రాబోయే మినీ ఆక్షన్‌కు ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడనుండటం పెద్ద చర్చకు దారితీసింది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌తో శాంసన్‌కు ఉన్న విబేధాలు.. చెన్నైతో డీల్ దాదాపుగా సెట్ అవ్వడంతో.. దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ విదేశీ ప్లేయర్స్ విషయంలో కొంచెం సందిగ్దత నెలకొనడంతో.. ఈ ట్రేడ్ డీల్ కాస్త లేట్ అయింది.

35
SRHలోకి రోహిత్.?

అటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రోహిత్ శర్మ వైపు మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు వెళ్లి అక్కడే కీలక సభ్యుడిగా మారాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

45
ట్రావిస్ హెడ్‌తో ఎక్స్చేంజి..

ట్రావిస్ హెడ్‌ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసి, రోహిత్ శర్మను తీసుకోవడానికి సన్‌రైజర్స్ ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం లేకపోగా.. ఒకవేళ నిజమైతే మాత్రం ఇది ఈ ఏడాదికి అతిపెద్ద సస్పెన్స్ ట్రేడ్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

55
శాంసన్ ట్రేడ్ కన్ఫర్మ్

సీఎస్కే యాజమాన్యం భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఎంఎస్ ధోనీ 2026 వరకు ఆడతానని చెప్పినప్పటికీ, దీర్ఘకాలికంగా ధోనీ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. అందుకే సంజూ శాంసన్‌ను ధోని స్థానంలో తీసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా సీఎస్కే రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కి ఇస్తోంది. అలాగే ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టులో విదేశీ ప్లేయర్స్ ఎక్కువ ఉండటంతో హసరంగాను విడుదల చేసి.. ఈ ట్రేడ్ ఫైనల్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories