దుమ్మురేపుతున్న భారత పారా అథ్లెట్లు... 24 గంటల్లో ఏడు మెడల్స్...

First Published | Aug 30, 2021, 9:41 AM IST

టోక్యో పారాలింపిక్స్‌ 2020లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మొత్తంగా ఏడు పతకాలు సాధిస్తే, పారాలింపిక్స్‌లో 24 గంటల్లోనే ఏడు పతకాలు రావడం విశేషం... పారాలింపిక్స్ చరిత్రలో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...

మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో ఫైనల్‌లో ఓడిన భవీనా పటేల్, రజతం సాధించి... దీపా మాలిక్ తర్వాత పారాలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో స్వర్ణం సాధించిన అవనీ లేఖరా... పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...

Latest Videos


మెన్స్ హై జంప్ టీ47 ఈవెంట్‌లో 2.06 మీటర్లతో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన నిషద్ కుమార్, రజతం సాధించాడు....

మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ యోగేశ్ కతునియా, రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు...

జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో పోటీపడిన 40 ఏళ్ల దేవేంద్ర జాజారియా, 64.35 మీటర్లతో తన పర్సనల్ బెస్ట్ నమోదుచేశాడు. రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన దేవంద్రకు ఇది పారాలింపిక్స్‌లో మూడో పతకం కావడం విశేషం...

మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్52 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు...

జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జర్, మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు....

పారాలింపిక్స్‌లో ఇంకా వారం రోజులు మిగిలే ఉండడం, బరిలో రికార్డు స్థాయిలో భారత అథ్లెట్లు నిలవడంతో మరిన్ని పతకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు క్రీడాభిమానులు...

click me!