సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నవాళ్లు చూడడానికి నిరుత్సాహంగా, జీవంలేని ముఖంతో... ఫేస్ చూపించడానికి సిగ్గు పడుతున్నట్టు కనిపించారు. అయితే సుశీల్ కుమార్‌లో అలాంటివేమీ కనిపించలేదు.
ఏదో సినిమాకి లేదా రెజ్లింగ్ పోటీలకు వెళ్తున్నట్టుగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు సుశీల్ కుమార్. పోలీసులు కూడా సుశీల కుమార్‌తో సెల్ఫీలు దిగడం విశేషం...
మే 4న రెజ్లర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సుశీల్ కుమార్, 19 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు మే 23న అతన్ని ముడ్కా ఏరియాలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.
భద్రతా కారణాలు వల్ల మండోలి జైలు నుంచి తీహార్ జైలుకి సుశీల్ కుమార్‌ని తరలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు.
ఛత్రపాల్ స్టేడియం వద్ద జరిగిన ఘర్షణల్లో యువ రెజ్లర్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఒలింపిక్ విన్నర్ సుశీల్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు రాణాపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.