SRH : కావ్య మారన్ మాస్టర్ ప్లాన్.. ఈ ఐదుగురు బాదుడుకి స్టేడియం షేక్ అవ్వాల్సిందే

Published : Mar 19, 2026, 08:06 PM IST

SRH : ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించి టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి ఐదుగురు స్టార్ ప్లేయర్లపై కావ్యా మారన్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

PREV
17
SRH : రూ. 23 కోట్లు అందుకే ఇచ్చారు ! ఈ ఐదుగురి దెబ్బతో పూనకాలే.. !

ఐపీఎల్ 2026 కు రంగం సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈ పొట్టి క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో 10 జట్లు తలపడనున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఈసారి సరికొత్త జోష్‌తో బరిలోకి దిగుతోంది. గత 10 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ కరవును ఈసారి ఎలాగైనా తీర్చాలని ఓనర్ కావ్యా మారన్ పక్కా ప్లాన్ తో ఉన్నారు.

2016లో చివరిసారిగా ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్, ఇప్పుడు 2026లో మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కావ్యా మారన్ ఐదుగురు విధ్వంసకర ఆటగాళ్లపై కళ్లు మూసుకుని నమ్మకం ఉంచారు. కోట్లాది రూపాయలు వెచ్చించి జట్టులో ఉంచుకున్న ఆ ఐదుగురు పిల్లర్స్ ఎవరో మీకు తెలుసా?

27
1. ఇషాన్ కిషన్: కొత్త కెప్టెన్.. కొత్త ఆశలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా నియమించింది. పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో కిషన్ టీమ్‌ను నడిపించనున్నారు. ఇటీవల భారత్ టీ20 ప్రపంచకప్ 2026 గెలవడంలో కిషన్ కీలక పాత్ర పోషించారు. గత సీజన్‌లో రూ. 11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్‌లో చేరిన కిషన్, 14 మ్యాచ్‌ల్లో 152.58 స్ట్రైక్ రేట్‌తో 354 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

37
2. ట్రావిస్ హెడ్: పవర్ ప్లేలో విధ్వంసం

ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ గత రెండు సీజన్లుగా హైదరాబాద్ జట్టుకు వెన్నెముకగా మారారు. ఇప్పటివరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 36.19 సగటుతో 941 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పవర్ ప్లే ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే హెడ్ కోసం కావ్యా మారన్ రూ. 14 కోట్ల భారీ పారితోషికాన్ని అందిస్తున్నారు. హెడ్ మెరుపులు మెరిపిస్తే ఎస్ఆర్హెచ్‌ను ఆపడం ఎవరితరం కాదు.

47
3. హెన్రిచ్ క్లాసెన్: జట్టులోనే అత్యంత ఖరీదైన ఆటగాడు

గత మూడేళ్లుగా హైదరాబాద్ జట్టుకు క్లాసెన్ అతిపెద్ద మ్యాచ్ విన్నర్. 42 మ్యాచ్‌ల్లో 44.18 సగటుతో, ఏకంగా 173.49 స్ట్రైక్ రేట్‌తో 1414 పరుగులు బాదారు. క్లాసెన్ ఖాతాలో 2 సెంచరీలు, 7 ఫిఫ్టీలు ఉన్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సామర్థ్యంపై నమ్మకంతో సన్‌రైజర్స్ ఏకంగా రూ. 23 కోట్లు చెల్లిస్తోంది. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడం, మ్యాచ్‌ను ఫినిష్ చేయడంలో క్లాసెన్ దిట్ట.

57
4. అభిషేక్ శర్మ: ప్రపంచ నంబర్ 1 బ్యాటర్

ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా వెలుగొందుతున్న అభిషేక్ శర్మ, గత ఏడేళ్లుగా హైదరాబాద్ జట్టుతోనే ప్రయాణం చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచిన అభిషేక్, 74 మ్యాచ్‌ల్లో 1753 పరుగులు చేశారు. గత రెండు సీజన్లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ యువ కెరటానికి ఈసారి రూ. 14 కోట్ల జీతం దక్కనుంది.

67
5. పాట్ కమిన్స్: అనుభవజ్ఞుడైన సారథి

2024 నుంచి జట్టులో ఉన్న కమిన్స్, గత రెండు సీజన్లలో జట్టును ముందుండి నడిపించారు. ఈసారి కూడా ఆయనే కెప్టెన్ అయినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లాడి 34 వికెట్లు తీసిన కమిన్స్‌కు ఎస్ఆర్హెచ్ రూ. 18 కోట్లు ఇస్తోంది. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ కమిన్స్ జట్టుకు అండగా నిలవనున్నారు.

77
IPL 2026 కోసం ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈశాన్ మలింగ/బ్రిడన్ కార్సే.

ఇంపాక్ట్ ప్లేయర్స్: జీషన్ అన్సారీ, శివమ్ మావి

Read more Photos on
click me!

Recommended Stories