ICC Men's T20 World Cup 2026 : భారత్ లేకుంటే బంగ్లాదేశ్ ఎక్కడిది.. బిసిసిఐ లేకుంటే బిసిబి ఎక్కడిది..! ఇదీ చరిత్ర

Published : Jan 23, 2026, 02:34 PM IST

ఏమిటీ బంగ్లాదేశ్… భారత్ చేసిన సాయాన్ని మరిచావా..? అసలు బిసిసిఐ లేకుంటే బిసిబి ఎక్కడిది. ఇంతేందుకు ఇండియా ఆదుకోకుంటే పాకిస్థాన్ చేతిలో చావుదెబ్బ తప్పకపోయేదిగా.. ఇవన్నీ మరిచి భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నావే..!

PREV
15
బంగ్లా మరీ బరితెగించిందిగా..

ICC Men's T20 World Cup 2026 : బంగ్లాదేశ్ బాగా ఎక్స్ట్రాలు చేస్తోంది... బరితెగించి మరీ సాయంచేసిన దేశానికే శత్రువులా వ్యవహరిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ లో అడుగుపెట్టబోమని బంగ్లా క్రికెట్ టీం ప్రకటించింది. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య వివాదం నడుస్తోంది... ఈ క్రమంలోనే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే బీసీబీ ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఈ స్థాయిలో ఉండటానికి బిసిసిఐ కారణం... అలాంటిది తిన్నింటి వాసాలనే లెక్కపెడుతోందంటూ టీమిండియా అభిమానులే కాదు సామాన్య ప్రజలుసైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

25
T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

త్వరలోనే ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌ ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో టోర్నీ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. ఆడితే భారత్‌లో ఆడాలని, లేదంటే తప్పుకోవాలని బంగ్లా క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం ఇచ్చింది. దీంతో భారత్‌కు రాకూడదని, ప్రపంచ కప్‌ను బహిష్కరించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఐసీసీ న్యాయం చేయలేదని, భారత్‌లో ఆడే విషయంలో ఒత్తిడికి తలొగ్గేది లేదని బంగ్లాదేశ్ క్రీడావ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ లో పర్యటిస్తే తమ క్రికెటర్లకు భద్రత ఉండదని...అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బిసిబి కోరింది. కానీ ఐసిసి ఇందుకు అంగీకరించలేదు... భారత్ లో ఎలాంటి ప్రమాదం ఉండదని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని సూచించింది. అయినా భారత్ లో అడుగుపెట్టేందుకు బంగ్లా ససేమిరా అనడంతో టోర్నీ నుండే తప్పుకునే పరిస్థితి వచ్చింది.

35
ఏంటి బంగ్లా... భారత సాయం మరిచావా..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ స్థాయిలో ఉండటానికి భారత్ ఎంతో సాయపడింది. ప్రస్తుత వైఖరితో బీసీబీ.. బీసీసీఐ చేసిన సాయాన్ని మరిచినట్టుంది. 1998లో బంగ్లాదేశ్ కు ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం లేనప్పుడే బిసిసిఐ ఎంతో సాయం చేసింది. అప్పటి ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లను (ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోపీ) బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా ఢాకాలోని బంగబంధు స్టేడియంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ బంగ్లాదేశ్ క్రికెట్‌కు కొత్త గుర్తింపు ఇచ్చింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా గెలిచినా అసలైన విజయం బంగ్లాదేశ్ క్రికెట్‌దే.

45
బంగ్లాకు టెస్ట్ హోదా కూడా బిసిసిఐ వళ్లే...

1977లో ఐసీసీ అసోసియేట్ సభ్యుడిగా చేరిన బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా కోసం 23 ఏళ్లు పట్టింది. 1999 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి బంగ్లాదేశ్ ఆశ్చర్యపరిచింది. దీంతో టెస్టు హోదాకు వారి వాదన బలపడింది. కానీ నిర్ణయాత్మక సపోర్ట్ భారత క్రికెట్ బోర్డ్ బీసీసీఐ నుంచే వచ్చింది. జగ్‌మోహన్ దాల్మియా సపోర్ట్ తోనే జూన్ 2000లో బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా లభించింది. నవంబర్ 2000లో భారత్‌తో చారిత్రక టెస్టు ఆడింది.

55
ఇండియా లేకుంటే బంగ్లా ఎక్కడిది...

అసలు భారతదేశమే లేకుంటే బంగ్లాదేశ్ ఎక్కడిది... ప్రపంచంలో ఈ పేరే వినిపించేది కాదు. పాకిస్థాన్ నుండి విడిపోయేందుకు బంగ్లాదేశ్ పోరాడుతున్న సమయంలో భారత్ సాయం మర్చిపోలేనిది. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ కు సైనిక సహకారం అదించారు...ఈ క్రమంలో పాకిస్థాన్ దాడులను కూడా భారత్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ప్రత్యక్షంగా పాక్ తో యుద్దం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహాయపడింది భారత్. అలాంటిది ఇప్పుడు ఈ దేశంలోనే అడుగుపెట్టబోం అంటున్నారు. ఇలా చేసినసాయాన్ని మరిచి బంగ్లా మరీ బరితెగించినట్లు వ్యవహరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories