Rohit Sharma: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలోని సవాళ్లను వివరించారు. శ్రేయస్ అయ్యర్, యజ్వేంద్ర చాహల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు తాను అనుసరించిన పారదర్శక విధానాలను చెప్పుకొచ్చారు.
టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక ప్రక్రియలోని సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక అంతర్జాతీయ జట్టుకు నాయకత్వం వహించేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సవాలు కేవలం మైదానంలో వ్యూహాలు రచించడం మాత్రమే కాదని, అర్హులైన ఆటగాళ్ళలో ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి అని నిర్ణయం తీసుకోవడమే అత్యంత కష్టమని ఆయన వివరించారు.
25
ఒక కెప్టెన్ గా తాను..
ముఖ్యంగా ప్రతిభావంతులైన ఆటగాళ్ళను జట్టు నుంచి తొలగించాల్సి వచ్చినప్పుడు వారిలో కలిగే నిరాశను అధిగమించడానికి ఒక కెప్టెన్ గా తాను అనుసరించిన పారదర్శక విధానాల గురించి రోహిత్ మనసు విప్పారు. గతంలో శ్రేయస్ అయ్యర్, యజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ లాంటి కీలక ఆటగాళ్ళను కొన్ని మెగా టోర్నీల నుండి తప్పించాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయం వెనుక ఉన్న సాంకేతిక కారణాలను, జట్టు సమతూకం కోసం బోర్డు తీసుకున్న వ్యూహాత్మక ఆలోచనలను వారికి నేరుగా వివరించినట్లు ఆయన వెల్లడించారు.
35
ఒక ఆటగాడిని ఎందుకు తీసుకోలేదో..
రోహిత్ అభిప్రాయం ప్రకారం, ఒక ఆటగాడిని ఎందుకు తీసుకోలేదో వారికి స్పష్టంగా చెప్పకపోవడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుందని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కలిసి ప్రతి ప్లేయర్ తో ముఖాముఖి చర్చలు జరిపి వారిని మానసికంగా సిద్ధం చేసేవారం అని తెలిపారు. ఈ పారదర్శకత ఆటగాళ్లకు భవిష్యత్తులో మెరుగుపడటానికి, తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, రోహిత్ శర్మ తన కెరీర్ లో తొలిసారిగా ఒక టీ20 ప్రపంచకప్‌ను మైదానంలో ఆటగాడిగా కాకుండా ఇంటి నుంచి ఒక ప్రేక్షకుడిగా చూడబోతున్న అంశంపై తనదైన శైలిలో స్పందించారు. 2007లో ప్రారంభమైన తొలి టీ20 ప్రపంచకప్ నుంచి మొన్నటి విజయం వరకు ప్రతి టోర్నీలో భాగమైన తనకు ఈసారి బయట నుంచి మ్యాచ్లను వీక్షించడం ఒక వింత, సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన అన్నారు.
55
రోహిత్ పూర్తి ధీమాగా..
అయితే, ప్రస్తుత భారత జట్టు ప్రదర్శనపై రోహిత్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా జట్టులోని 80 నుంచి 90 శాతం మంది ఆటగాళ్లు నిలకడగా కలిసి ఆడుతూ ఉండడం, జట్టు సగటు వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే ఉండడం భారత్ కు పెద్ద సానుకూల అంశమని ఆయన తెలిపారు.