దెబ్బ మీద దెబ్బ.. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాలో టెన్షన్.. టెన్షన్..

Published : Jan 22, 2026, 09:35 PM IST

T20 World Cup: న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో టీమ్ ఇండియాకు ఫిట్‌నెస్ సమస్యలు పెరిగాయి. డారిల్ మిచెల్ క్యాచ్‌ను పట్టుకునే ప్రయత్నంలో అతని ఎడమచేతి వేలికి గాయమైంది. 

PREV
15
టీ20ల్లో పులి..

టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస సిరీస్‌లు గెలుస్తూ రాబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమవుతోంది. అయితే, ఈ దూకుడుకు ఆటగాళ్ల గాయాలు బ్రేక్ వేస్తున్నాయి. కీలక ప్లేయర్లు ఒకరి తర్వాత మరొకరు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతూ మెగా ఈవెంట్‌కు ముందు జట్టును టెన్షన్ పెట్టిస్తున్నారు.

25
తొలి మ్యాచ్‌లో గాయం..

తాజాగా, న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ప్రధాన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. డారిల్ మిచెల్ కొట్టిన రిటర్న్ క్యాచ్‌ను పట్టుకునే ప్రయత్నంలో అతని ఎడమచేతి వేలికి తీవ్రంగా దెబ్బ తగిలింది. దీంతో అక్షర్ నొప్పితో విలవిలలాడిపోయి, మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళాడు. ఆ తర్వాత అతను తిరిగి మైదానంలోకి రాలేదు. అక్షర్ వదిలేసిన ఓవర్‌లోని మిగిలిన మూడు బంతులను అభిషేక్ శర్మ వేశాడు. ఫీల్డింగ్‌లో అక్షర్ పటేల్‌కు బదులుగా రవి బిష్ణోయ్ వచ్చాడు.

35
గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..

ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. తర్వాతి మ్యాచ్‌లలో అతను బరిలో దిగుతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్షర్ పటేల్ స్థానంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన గత టీ20 సిరీస్‌లో షాబాజ్ అహ్మద్‌ను తీసుకున్నారు. కివీస్‌తో తర్వాతి మ్యాచ్‌లలో కూడా అక్షర్ అందుబాటులో లేకపోతే షాబాజ్ అహ్మద్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.

45
అక్షర్ పటేల్ డౌట్..

అక్షర్ పటేల్ టీమ్ ఇండియాకు కీలకమైన ఆల్ రౌండర్‌గా ఎదిగాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా నిరూపించుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అతను ప్రధాన ఆయుధం అవుతాడని అంచనాలున్నాయి. అక్షర్ పటేల్‌తో పాటు, మరికొందరు కీలక ఆటగాళ్లు కూడా గాయాల బారిన పడ్డారు. న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమయ్యాడు. టెస్టిక్యులర్ సర్జరీ కారణంగా అతను ఆ మ్యాచ్‌లకు ఆడట్లేదు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే చివరి రెండు మ్యాచ్‌లలో, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడతాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా భావిస్తున్న కివీస్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకు దూరమవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

55
సుందర్‌కు ఫిట్ నెస్ సమస్యలు..

స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన సుందర్ స్థానంలో ఆయుష్ బధోని ఛాన్స్ దక్కించుకున్నాడు, కానీ తుది జట్టులోకి రాలేకపోయాడు. టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది, అయితే నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో అయ్యర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories