Team India : రోహిత్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ !

Published : Feb 07, 2026, 10:38 AM IST

Virat Kohli Rohit Sharma : భారత క్రికెట్ నియంత్రణ మండలి స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చింది. బీసీసీఐ 2025-26 వార్షిక కాంట్రాక్టుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ తగ్గింది. ఏ+ కేటగిరీని తొలగించి, గిల్, బుమ్రా, జడేజాలను టాప్ గ్రేడ్‌లో చేర్చారు.

PREV
16
కోహ్లీ, రోహిత్ గ్రేడ్ తగ్గింపు.. కొత్త కాంట్రాక్ట్ లిస్ట్ ఇదే !

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసింది. టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించింది. గతంలో అత్యున్నతమైన A+ కేటగిరీలో ఉన్న వీరిద్దరిని ఇప్పుడు గ్రూప్ Group B కి మార్చడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసిందనడానికి సంకేతంగా కనిపిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

26
ఏ+ కేటగిరీ రద్దు.. కొత్త విధానం అమలు

తాజా రిపోర్టుల ప్రకారం, బీసీసీఐ తన కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. గతంలో ఉన్న నాలుగు కేటగిరీల (A+, A, B, C) స్థానంలో ఇప్పుడు కేవలం మూడు కేటగిరీల (A, B, C) వ్యవస్థను ప్రవేశపెట్టింది. అత్యధికంగా రూ. 7 కోట్లు పారితోషికం లభించే ఏ+ కేటగిరీని బీసీసీఐ పూర్తిగా రద్దు చేసింది. ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా, ఆటగాళ్ల లభ్యత, వారు ఆడే ఫార్మాట్ల ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

36
కోహ్లీ, రోహిత్ డిమోషన్‌కు కారణం ఇదే

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ బీ కి తగ్గించడానికి ప్రధాన కారణం వారు ప్రస్తుతం పరిమిత ఫార్మాట్లకే పరిమితం కావడం. ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా వైదొలిగారు. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్లు ఆడే లేదా జట్టును నడిపించే కీలక ఆటగాళ్లకే టాప్ గ్రేడ్ దక్కుతుంది. అందుకే కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్న కోహ్లీ, రోహిత్ గౌరవార్థం కాకుండా వారి ప్రస్తుత సహకారం ప్రాతిపదికన గ్రూప్ బీ కి కేటాయించారు.

46
టాప్ గ్రేడ్‌లో నిలిచిన ముగ్గురు స్టార్లు

కొత్త విధానంలో గ్రూప్ ఏ ఇప్పుడు అత్యున్నత కేటగిరీగా మారింది. ఇందులో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. భారత టెస్ట్, వన్డే జట్ల కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. వీరు మూడు ఫార్మాట్లలో అందుబాటులో ఉండటం లేదా జట్టులో కీలక పాత్ర పోషిస్తుండటం వల్ల వీరికి ఈ గౌరవం దక్కింది. జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఇతర ఫార్మాట్లలో అతని ప్రాధాన్యం బట్టి ఏ గ్రేడ్‌లో కొనసాగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

56
గ్రూప్ బీ, గ్రూప్ సీ జాబితాలో ఎవరున్నారు?

గ్రూప్ బీ లో కోహ్లీ, రోహిత్‌లతో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి 11 మంది ఆటగాళ్లు ఉన్నారు.

గ్రూప్ బీ: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్.

గ్రూప్ సీ: ఈ కేటగిరీలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వంటి 16 మంది ఇందులో ఉన్నారు.

66
మహిళా జట్టు కాంట్రాక్టులు, షాకింగ్ మినహాయింపులు

పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను కూడా బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్ ఏ లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. 

మరోవైపు, పురుషుల విభాగంలో మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లకు ఈసారి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. గతంలో గ్రేడ్ ఏ లో ఉన్న షమీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే అధికారికి ప్రకటన చేసే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories