తొలిరోజు జరిగే మ్యాచ్‌ల్లో ఆరు జట్ల నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. వీరు తమ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు. వారిలో
1. అభిషేక్ శర్మ (భారత్): టీమిండియా నయా సెన్సేషన్, 'సిక్స్ హిట్టింగ్ మెషిన్'గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న అతను, తన తొలి ప్రపంచకప్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు.
2. సయీమ్ అయూబ్ (పాకిస్థాన్): పాక్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్న ఈ యువ ఓపెనర్ తన సరికొత్త షాట్లతో పరుగుల వర్షం కురిపించగలడు.
3. షిమ్రాన్ హెట్మేయర్ (వెస్టిండీస్): ఈసారి నంబర్ 3లో బ్యాటింగ్‌కు రానున్న షిమ్రాన్ హెట్మేయర్, కరీబియన్ జట్టుకు వెన్నెముకగా మారనున్నాడు.
4. మొనాంక్ పటేల్ (అమెరికా): అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ తన జట్టును ముందుండి నడిపించడమే కాకుండా వేగంగా పరుగులు సాధించడంలో గుర్తింపు పొందాడు.
5. రిచీ బెరింగ్టన్ (స్కాట్లాండ్): స్కాట్లాండ్ కెప్టెన్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి జట్టుకు భారీ స్కోరును అందించగలడు.
6. మాక్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై సునామీ బ్యాటింగ్ తో విరుచుకుపడగల సత్తా ఉన్న ప్లేయర్.