Neeraj Chopra: తగ్గేదేలే.. ఈసారి టార్గెట్ అదే.. నీరజ్ చోప్రా షాకింగ్ కామెంట్స్

First Published | Nov 18, 2021, 4:12 PM IST

Neeraj Chopra: చరిత్రలో తొలిసారి ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా.. ఈ విజయం తర్వాత ఇండియాలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు. 

ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణ కాంక్ష తీర్చిన నీరజ్ చోప్రా  వచ్చే విశ్వ వేదికల్లో కూడా అంతకంటే అదిరిపోయే ప్రదర్శన చేస్తానంటున్నాడు. 

చరిత్రలో తొలిసారి ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా.. ఈ విజయం తర్వాత ఇండియాలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు.  జావెలిన్ త్రో విభాగంలో పాల్గొన్న అతడు.. ఏకంగా 87.58 మీటర్లు విసిరి పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. 

Latest Videos


ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చిన  తర్వాత నీరజ్ చోప్రా.. సన్మానాలు, సత్కారాలు, పురస్కారాల కార్యక్రమాలతో  బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే అతడికి కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కూడా అందించింది. 

కాగా.. వచ్చే ఒలింపిక్స్ లో తన రికార్డును తానే చెరిపేస్తానని నీరజ్ చోప్రా అంటున్నాడు. 2024 లో జరుగబోయే పారిస్ ఒలింపిక్స్ లో కచ్చితంగా 90 మీటర్లు విసురుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే తన టార్గెట్ అని కూడా చెప్పాడు. ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 88.07 మీటర్లు విసిరాను. వచ్చే ఒలింపిక్స్ లో 90 మీటర్లు విసురుతా. కానీ అది అప్పటి పరిస్థితులు, నా శరీరం సహకరంచేదానిమీద ఆధారపడి ఉంటుంది. 

జావెలిన్ త్రోలో  దూరాలు ప్రతిసారి మారుతుంటాయి. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. అంతేగాక అభిమానుల అంచనాలు కూడా పెరుగుతాయి. అయితే నా వరకు నేనైతే ఫీల్డ్ లో వంద శాతం ఆటను ఆడటానికి ప్రయత్నిస్తా. 

ఒలింపిక్స్ తర్వాత ఇంటి పట్టునే ఉంటున్న ఈ పానిపట్టు కుర్రాడు.. త్వరలోనే మళ్లీ శిక్షణ కేంద్రానికి వెళ్లనున్నట్టు చెప్పాడు. వచ్చే ఏడాది యూఎస్ లో వరల్డ్  ఛాంపియన్స్ జరుగనున్న నేపథ్యంలో వాటి కోసం సన్నద్దమవ్వాలని నీరజ్ భావిస్తున్నాడు.

‘ఆ టోర్నమెంట్ (వరల్డ్ ఛాంపియన్షిప్) లో పతకం గెలవగలననే భావిస్తున్నా. దాన్లో ఒత్తిడేం లేదు. ఏదేమైనా వచ్చే సీజన్ అంతా బిజీ బిజీగా గడపాల్సి ఉంది.  వచ్చే ఏడాది నుంచి ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్  డైమండ్ లీగ్స్ ఉన్నాయి. అందుకు నేను శారీరకంగానే గాక మానసికంగా కూడా సిద్ధమవాల్సి ఉంది..’ అని చెప్పాడు. ఇక తన శిక్షణకు సంబంధించిన విషయాలను ఎఎఫ్ఐ, శాయ్, కోచ్ లు చూసుకుంటాయని తెలిపాడు. 

click me!