ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్, తులసి లాంటి శుభప్రదమైన మొక్కలను సరైన దిశలో పెడితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచకపోవడం మంచిది. అవేంటో చూద్దాం.
ఈ రోజుల్లో ఇంట్లో మొక్కలు పెంచడం ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. కానీ, అలా ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో సరైన దిశలో పెడితేనే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదని చెబుతున్నారు. మరి ఏ మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
ముళ్ల మొక్కలు అస్సలు వద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు, ఆకులు లేదా పువ్వులు కోసినప్పుడు పాలు వంటి తెల్లటి ద్రవం కారే మొక్కలను పెంచకూడదు. ఈ మొక్కలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. గులాబీ వంటి మొక్కలను ఇంటి ఆవరణలో లేదా టెర్రస్ మీద పెంచుకోవడం మంచిది.
36
ఈ మొక్కలతో పాజిటివ్ వైబ్స్
వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్, క్రాసులా, బాంబూ వంటి మొక్కలు పెట్టడం చాలా శుభప్రదం. వీటివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని బెడ్‌రూమ్‌లో మాత్రం పెట్టుకోకూడదని సూచిస్తున్నారు.
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే, దాని తీగ పైకి పాకేలా చూసుకోవాలి. ఆకులు నేలను తాకకూడదు. అలాగే తులసి మొక్కను ఇంటి ఆవరణలో నాటడం శుభప్రదం. దీనివల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందని నమ్మకం.
56
ఫ్లవర్ వేజ్
ఇంట్లో ఫ్లవర్ వేజ్ పెడితే, అందులో రోజూ తాజా పువ్వులనే ఉంచాలి. వాడిపోయిన పువ్వులు, ఆకులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. కాబట్టి వాటిని వెంటనే తీసేయాలి. ఫ్లవర్ వేజ్‌ను లివింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే ఫ్లవర్ వేజ్ ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.
66
మొక్కల సంరక్షణ మర్చిపోవద్దు
ఇంట్లో ఏ మొక్కలు పెట్టినా, వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు, పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి. అవసరమైన మేర నీరు పోయడం, బలంగా పెరగడానికి కావాల్సిన సహజ ఎరువులు వేయడం మంచిది. దానివల్ల మొక్కలు అందంగా, పచ్చగా పెరుగుతాయి. ఇంటి అందాన్ని, పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి.